హైదరాబాద్, ఫిబ్రవరి 11 నేడు దేశం లో సౌర శక్తికి అత్యంత ప్రాధాన్యం ఉండబోతున్నది. ఇది పర్యావరణ పరిరక్షణకు, వాతావరణ మార్పులతో ఉత్పన్నమవుతున్న సమస్యల పరిష్కారానికి భారత లక్ష్యాల సాధనకు ప్రీమియర్ ఎనర్జీస్ దేశవ్యాప్తంగా 250 మెగావాట్లకుపైగా సోలార్ పవర్ ప్లాంట్లను నిర్వహిస్తున్నది. సొంతంగా కూడా సౌర శక్తిని ఉత్పత్తి చేస్తున్న ఈ సంస్థ.. గతేడాదితో ప్రారంభమై 25 ఏండ్లు పూర్తి చేసుకున్నది. ప్రీమియర్ ఎనర్జీస్ ప్రధాన కేంద్రం సికింద్రాబాద్‌లో ఉండగా, 2023కల్లా దేశంలోని టాప్-5 సోలార్ ఇండస్ట్రీ సంస్థల్లో ఒకటి కావాలన్నదే సంస్థ లక్ష్యం. ఈ నేపథ్యంలో ఈ ప్లాంట్ రాకతో ఆ లక్ష్యం నెరవేరగలదన్న నమ్మకాన్ని ఈ సందర్భంగా ప్రీమియర్ ఎనర్జీస్ యాజమాన్యం వ్యక్తం చేస్తున్నది. సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీతోపాటు సోలార్ రూఫ్‌టాప్స్, పంపులు, వీధి లైట్లు, ఆఫ్‌గ్రిడ్, ఈ-వెహికిల్స్, లిథియం బ్యాటరీలను సంస్థ ఉత్పత్తి చేస్తున్నది. ఈపీసీ సొల్యూషన్స్, సోలార్ హైబ్రిడ్ సొల్యూషన్స్‌నూ అందిస్తున్నది.‘దేశీయ విద్యుదుత్పత్తిలో భవిష్యత్తు అంతా పునరుత్పాదక శక్తిదే. ముఖ్యంగా సౌర శక్తికి అత్యంత ప్రాధాన్యం ఉండబోతున్నది. ఈ కొత్త ప్లాంట్‌తో మా సంస్థ ఉత్పాదక సామర్థ్యం గణనీయంగా పెరుగుతున్నది. ఇది పర్యావరణ పరిరక్షణకు, వాతావరణ మార్పులతో ఉత్పన్నమవుతున్న సమస్యల పరిష్కారానికి భారత లక్ష్యాల సాధనకు దోహదపడగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం. కొత్త ప్లాంట్‌లో అత్యాధునిక ఆటోమేషన్, రోబోటిక్స్ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్నాం. ఆసియా, ఐరోపా, అమెరికాల్లోని ప్రపంచ శ్రేణి ఉత్పాదక సంస్థల సరసన ఇక ప్రీమియర్ ఎనర్జీస్ కూడా ఉంటుంది.’
ఇందులోబాగంగా హైదరాబాద్‌లో నూతన ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నది. ఈ-సిటీ వద్ద రూ.483 కోట్లతో నిర్మిస్తున్నారు. 25 ఎకరాల్లో వస్తున్న ఈ ఉత్పాదక కేంద్రం వార్షిక సామర్థ్యం 1.5 గిగావాట్లు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ ప్రస్తుత ఉత్పాదక సామర్థ్యం 500 మెగావాట్ల మాడ్యూల్స్, 60 మెగావాట్ల సెల్స్‌గా ఉన్నది. కాగా, కొత్త ప్లాంట్‌లో నవ తరం ఎంసీసీఈ టెక్స్‌చర్డ్ మల్టీ క్రిస్టలైన్ సెల్స్, మోనో పీఈఆర్‌సీ సెల్స్‌ను తయారు చేయనున్నారు.