ఆదరించండి అభివృద్ధి చేస్తా అంటూ మంత్రాలయం గ్రామ పంచాయతీ కి వైకాపా రెబల్ అభ్యర్థిగా వడ్డే నారాయణ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రాలయం గ్రామ ప్రజలకు సేవచేసే భాగ్యాన్ని కల్పించాలని ప్రజలను వేడుకున్నారు.మంత్రాలయం గ్రామ అభివృద్ధికి నా శాయశక్తులా కృషి చేస్తానని, అందరి సహకారంతో మంత్రాలయం గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. మంత్రాలయం పంచాయతీ కి వైకాపా అదిష్టానం
బలపరిచిన అభ్యర్థిగా ఎడ్ల బండ భీమయ్య నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. వైకాపా పార్టీ రెబల్ అభ్యర్థిగా వడ్డే. నారాయణ నామినేషన్ వేయడంతో సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.