YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమలలో రెచ్చి పొతున్న ఇంటి దొంగలు అందిన కాడికి దోచేయ్

తిరుమలలో రెచ్చి పొతున్న ఇంటి దొంగలు అందిన కాడికి దోచేయ్
తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదం కోసం ఎంత ఖర్చుచేయడానికైనా వెనుకాడరు. అక్రమ వాటాల శ్రీవారి లడ్డూ అక్రమ విక్రయాల్లో ఇంటి దొంగలదే హవా. కౌంటర్‌ సిబ్బంది నుంచి ట్రే లిఫ్టర్ల వరకు ఎక్కువ మంది ఈ అక్రమాల్లో వాటాదారులే. కొందరు నేరుగా భక్తులకు లడ్డూలు విక్రయిస్తుంటారు. మరికొందరు దళారులతో ఈ అక్రమ దందా నడిపిస్తున్నారు. .టీటీడీ విజిలెన్స్‌ విభాగం ఇంటిదొంగల విషయంలో చోద్యం చూస్తోందిఆలయ సమీప ప్రాంతాల్లో సుమారు 200మందికిపైగా లడ్డూ దళారులు అక్రమ విక్రయాలు సాగిస్తున్నట్టు సమాచారం. దీనికి కారకులైన ఇంటిదొంగల్ని ఏరివేయడంలో సంబంధిత అధికారులు చొరవ చూపడం లేదనే విమర్శలున్నాయి. టీటీడీ ఈవో సింఘాల్, జేఈవో కేఎస్‌.శ్రీనివాసరాజు ఆదేశాలతో కొన్నాళ్లు తగ్గినా మళ్లీ లడ్డూల అక్రమ దందా పుంజుకుంది. ఈ వేసవి రద్దీలో కాసులు దండుకోవాలని ఇంటిదొంగలు, దళారులు నిమగ్నమైనట్లు సమాచారం.భక్తుల అవసరాలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. లడ్డూ దళారులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో లడ్డూ టోకెన్లు ఇచ్చే సిబ్బంది, స్కానింగ్‌ చేసే సిబ్బంది, లడ్డూ కౌంటర్‌ సిబ్బంది, లడ్డూ ట్రే లిఫ్టర్లు.. ఇలా సామూహికంగా కలసిపోయి అక్రమ దందాను నడిపిస్తున్నారు. భక్తులకు అందాల్సిన లడ్డూలను నల్లబజారులోకి తరలిస్తున్నారు. కాలిబాటల్లో నడిచివచ్చే భక్తులకు ఇచ్చే టోకెన్లకు ఒక లడ్డూ ఉచితంగా పొందవచ్చు. అలాంటి టోకెన్లను కొందరు సిబ్బంది దొడ్డిదారిన దళారులకు అందజేస్తుంటారు. వాటిని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో కొందరు స్కానింగ్‌ సిబ్బందితో ఒప్పందం కుదుర్చుకుని పద్ధతి ప్రకారం స్కానింగ్‌ చేస్తారు. వాటిని వెలుపల ట్రేలిఫ్టర్లు దళారులకు అందజేస్తారు. కాలిబాట భక్తులకు రూ.20 రెండు లడ్డూల సబ్సిడీ టోకెన్లు కూడా అదే పద్ధతి ప్రకారమే వెలుపల దళారులకు అందజేస్తారు. వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తుంటారు.రోజూ 72 వేల మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. వీరికోసం టీటీడీ రోజూ 3 లక్షల లడ్డూలు తయారుచేసి విక్రయిస్తోంది. సర్వదర్శనం భక్తులకు ఒక్కొక్కరికి 4 (రూ.25 చొప్పున రెండు, రూ.10 చొప్పున 2), కాలిబాట భక్తులకు ఒకరికి 5 (ఒకటి ఉచితం, రూ.25 చొప్పున రెండు, రూ.10 చొప్పున 2), రూ.300 టికెట్ల భక్తులకు ఒకరికి 2, వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల భక్తులకు ఒకరికి 2, వివిధ దర్శన టికెట్లతోపాటు అదనపు లడ్డూల కోసం రూ.25 నగదు చెల్లించిన వారికి 2 నుంచి 6 లడ్డూలు పొందవచ్చు. టీటీడీ తయారు చేసే లడ్డూలు భక్తులకు చాలడం లేదు. భక్తులు బయటవ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తోంది.ఓ లడ్డూ తయారు చేయడానికి టీటీడీకి ప్రస్తుతం రూ.35 దాకా ఖర్చవుతోంది. ధర్మప్రచారం, సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని టీటీడీ కాలిబాటల్లో నడిచి వచ్చిన భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా అందజేస్తోంది. కాలిబాటతోపాటు సర్వదర్శనం భక్తులకు సబ్సిడీ ధరతో రూ.20కే రెండు లడ్డూలు అందజేస్తున్నారు. రూ.25 చొప్పున రూ.50కి మరో రెండు లడ్డూలు ఇస్తుంటారు. కాలిబాటలో వచ్చిన భక్తులకు ఒకరికి ఉచిత లడ్డూతో కలిపి 5 లడ్డూ టోకెన్లు, సర్వదర్శనం భక్తులకు 4 లడ్డూల టోకెన్లు పొందే అవకాశం ఉంది. వీటిలో దాదాపు 20 శాతం వరకు దొడ్డిదారిలో తరలివెళుతున్నట్టు విమర్శలున్నాయి.

Related Posts