నెల్లూరు గ్రామీణ నియోజవర్గ పరిధిలోని 35వ డివిజన్ గౌతమి నగర్ సచివాలయం పరిధిలో మహిళా మార్చ్ 100 రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు మహిళా చట్టాలు, ఉమెన్ ట్రాఫికింగ్, బాల్యవివాహాల నిర్మూలన తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 35వ డివిజన్ అడ్మిన్ జబ్బార్, ప్లానింగ్ కార్యదర్శి కృష్ణయ్య, మహిళా పోలీస్ శోభా, భాను , పవిత్ర తదితరులు పాల్గొన్నారు.