నంద్యాల పట్టణంలో గురువారం నాడు జరిగిన విలేకరుల సమావేశంలో. రాజు నాయక్ మాట్లాడుతూ
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక తండా పంచాయతీలు వై ఎస్ ఆర్ సి పి సర్పంచులుగా క్లీన్ స్వీప్ చేసిందని తెలిపారు , పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో వై ఎస్ ఆర్ సి పి పార్టీకి చెందిన గిరిజన సర్పంచులు సంబరాలు జరుపుకుంటున్నారని ఆయన అన్నారు , సీఎం జగన్మోహన్ రెడ్డి గిరిజనులు ఎప్పుడు రుణపడి ఉంటారని గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు నాయక్ అన్నారు . గిరిజన ప్రజలు సంక్షేమానికి పట్టం కట్టారని, జనరంజక పాలన కు ఆమోదముద్ర వేశారన్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలలో వై ఎస్ ఆర్ సి పి పార్టీకి చెందిన గిరిజన మద్దతుదారులను భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. కొన్ని తండాలలో సంక్షేమం కావాలంటూ గ్రామ అభివృద్ధి కోసం ఏకగ్రీవాలు అయ్యాయని తెలిపారు. అలాగే 2 విడుదల ప్రత్యేక గ్రామపంచాయతీ లైన తండాలలో ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఇదే ఊపుతో 2 3 4 విడతల పంచాయతీ ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల తెలుగు దేశం పార్టీకి కంచుకోట ఉన్నప్పటికీ కూడా వై ఎస్ ఆర్ సి పి సర్పంచులను గెలిపించి గిరిజనులు నిజమైన విశ్వాసం చూపించారన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా ధర్మ సేన రాష్ట్ర అధ్యక్షుడు రాజా రామ్ నాయక్, జి పి ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్, ప్రధాన కార్యదర్శి వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జాయింట్ సెక్రెటరీ విజయ్ నాయక్, స్వామి నాయక్ విక్రమ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.