ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి ఆత్మార్పణతో ఆర్యవైశ్యులుగా గుర్తింపు పొందామని శ్రీ ఆర్యవైశ్య సంఘం కార్యధ్యక్షులు భవనాశి శ్రీనివాసులు(వాసు)అన్నారు.మెయిన్ బజార్లోని అమ్మవారిశాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అమ్మవారి ఆత్మార్పణ మహోత్సవ ఆహ్వానాని కి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారు అగ్నిగుండంలో ప్రవేశించి నేటికి 2501 సంవత్సరాలు అయిందని అన్నారు.ఫిబ్రవరి 13 న శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని 108 కన్యలచే కళాశాలలో జలం తెప్పించి అమ్మవారికి అభిషేకం చేస్తామని అన్నారు. గురువారం నాడు . అమ్మవారికి పాలాభిషేకం నిర్వహించామని అన్నారు.శుక్రవారం సత్ సంతాన సౌభాగ్య వ్రతం,శనివారం అమ్మవారి ఆత్మర్పణ దినం రోజు జలంతో అభిషేకాలు,కుంకుమార్చన చేస్తామని అన్నారు.ఆర్యవైశ్య కుటుంబాలు అమ్మవారి ఆత్మర్పణ రోజు ఇండ్ల ముంగిట రంగులతో ముగ్గులు వేసి ప్రధమ ద్వారాలకు మామిడి తోరణాలు,పులా హారాలు వేయాలన్నారు.ఆత్మర్పణ రోజు అమ్మవారికి బంగారు చీరెతో పాటు డైమండ్స్ పొదిగిన బంగారు పాదాలు సమర్పించి అలంకరిస్తామని అన్నారు.సాయంత్రం సంసృతిక కార్యక్రమాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని అన్నారు.ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి బైసాని రామ శేషు,అడ్డగాళ్ల రామశేషు,మిరియాల రాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.