YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

టీఆర్ఎస్ నాయకులకు మైనార్టీ నాయకుడు మొహమ్మద్ ఖుతుబొద్దిన్ పాషా సవాల్...

టీఆర్ఎస్ నాయకులకు మైనార్టీ నాయకుడు  మొహమ్మద్ ఖుతుబొద్దిన్ పాషా సవాల్...

అభివృద్ధి పనులపై, ప్రజా సంక్షేమం పై ప్రశ్నిస్తే అధికార పార్టీకి చెందిన నాయకులు కొందరు బెదిరింపులకు పాల్పడుతుండటం మెట్ పల్లి పట్టణంలో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇటీవల పలు సందర్భాల్లో మెట్ పల్లి పట్టణంలో అభివృద్ధి పనుల పై, పెండింగ్లో ఉన్న పనులపై, ప్రజా సంక్షేమం పై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న  మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషాను కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు బెదిరింపులకు పాల్పడడం కలకలం రేపుతోంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2004లో అప్పటి ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మెట్ పల్లి ఎమ్మెల్యే, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు మెట్ పల్లి పట్టణంలోని బీడీ కాలనీలో షాదీఖాన నిర్మాణానికి 20 గుంటలు మంజూరు చేయించారు. ఇది అందరికీ తెలిసిందే.2005లో పనులకు శంకు స్థాపన చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టించుకునే నాధుడే ఎవరు లేరు. నేటి వరకు షాదీఖాన ఏర్పాటు కలగానే మిగిలింది. దీన్ని ప్రశ్నించే గొంతును టిఆర్ఎస్ ప్రభుత్వం నొక్కాలని చూస్తోందని మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా ఆరోపించారు.ఇటీవల పలు సందర్భాల్లో మెట్ పల్లిలో షాదీఖానా ఏర్పాటు, ఉర్దూ మీడియం స్కూల్ బిల్డింగ్ నిర్మాణం, అదేవిధంగా కబ్రస్తాన్ గురించి మాట్లాడితే అధికార పార్టీకి చెందిన వారు బెదిరింపులకు పాల్పడుతుండడం జరిగిందన్నారు. అందు కొరకు తాను వారికి ఒకటే చెబుతున్న శుక్రవారం రోజున నమాజ్ తర్వాత 2.00 గంటలకు పాత బస్టాండ్ శాస్త్రి విగ్రహం వద్ద కూర్చుంటున్నానని తెలిపారు. ఎవరు వచ్చి నన్ను బెదిరిస్తారో చూద్దాం.. బెదిరించిన మాత్రాన సమస్యలపై నా పోరాటం ఆగదని, చివరి నిమిషం వరకు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. కాగా టిఆర్ఎస్ నాయకులు బెదిరింపులకు పాల్పడడం, ఇందుకు  మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా వారికి సవాల్ విసరడం చర్చనీయాంశమైంది. శుక్రవారం రోజున పట్టణంలోని పాత బస్టాండ్ లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

Related Posts