రెండవ విడత కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణికి ఏర్పాట్లను పూర్తిచేసుకొని సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి రెండవ విడత కోవిడ్ వ్యాక్సిన్ పంపిణిపై అధికారులతో జూమ్ వెబ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతు, జిల్లాలో మొదటి విడతలో 5987 మందికి కోవిడ్ వ్యాక్సిన్ ను ఇవ్వడం జరిగిందని, మొదటి వ్యాక్సిన్ తీసుకున్న 29వ రోజు నుండి రెండవ విడత వ్యాక్సిన్ 100% అందజేయడానికి అన్ని ఏర్పాట్లను చేయడానికి గ్రామ, మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసి, ఫ్రంట్ లైన్ సిబ్బంది కి ఇప్పటి వరకు ఎంతమందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎంతమందికి ఇవ్వవలసి ఉన్నది, అనాసక్తిగా ఉన్నావారి పూర్తి వివరాలను నివేదిక రూపంలో సమర్పించాలని , వారికి అవగాహన కల్పించాలని సూచించారు. రెండవ విడత వ్యాక్సిన్ ఇవ్వడానికి కావలసిన ఏర్పాట్లను సమకుర్చుకోవడంతో పాటు వాక్సిన్ ఇవ్వవలసిన వారికి ఎప్పడు ఎక్కడికి ఎ తేదీ, సమయంలొ కేంద్రానికి రావాలి అనే సమాచారాన్ని ముందుగా అందించాలని సూచించారు. ప్రతి వ్యాక్సిన్ నేషన్ కేంద్రం వద్ద సామాజిక దూరాన్ని పాటించడం, మాస్కులు దరించడం వంటి కనీస కోవిడ్ నిబంధనలను పాటించేలా చర్యలు చేపట్టేలా చూడాలని, మండల టాక్స్ ఫోర్స్ సమావేశాలు నిర్వహించడం వలన వ్యాక్సినేషన్ కొరకు లబ్దిదారులు తక్కువ రావడానికి పరిష్కరం లబిస్తుందని, వారందరికి డాక్టర్ ల ద్వారా వ్యాక్సిన్ పై ఉన్న అపోహలను నివృత్తిచేయలని పేర్కోన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. రాజేషం, స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ బి. రాజేషం, జిల్లా వైద్యాధికారి పి.శ్రీధర్, ఇతర అధికారులు పాల్గోన్నారు.