YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలలో అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు

ప్రభుత్వ పాఠశాలలో అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు  అధికారుల నిర్లక్ష్యంతోనే  విద్యకు దూరం అవుతున్నారని  పి డి ఎస్ యు జిల్లా నాయకులు మల్లికార్జున విమర్శించారు . బుధవారం  స్థానిక  పిడిఎస్యు కార్యాలయంలో  ఏర్పాటుచేసిన  విలేకరుల సమావేశంలో  ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఉన్నటువంటి టి.జి ఎల్.వి పాఠశాలలో అక్కడ చదువుతున్న విద్యార్థులు చదువుకోవడానికి పాఠశాలకు వస్తే అక్కడ  మౌలిక సదుపాయాలు లేక అలాగే క్లాస్ రూమ్ లో విద్యను బోధించడానికి ఉపాధ్యాయులు   సరిగా లేక విద్యార్థులు విద్యకు దూరం అవుతున్న పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి   టీ జి ఎల్ వి పాఠశాలలో నెలకొంది అన్నారు. గతంలో కొన్ని సంవత్సరాల కిందట ఈ పాఠశాలలో కొన్ని వందల సంఖ్యలో మంది విద్యార్థులు చదివేవారు అన్నారు. ఈ రోజు నాటికి మొత్తానికి 30 మంది విద్యార్థులు మాత్రమే ఉన్న పరిస్థితి కనిపిస్తున్నది అన్నారు. ఈ పాఠశాల ను ఎప్పుడు ఎత్తి వేస్తారో అన్న పరిస్థితి నెలకొంది అన్నారు. కావున అక్కడున్న విద్యార్థులు చదువుకు దూరం కావడానికి విద్యాధికారుల నిర్లక్ష్యమే అనేపరిస్తితి కనిపిస్తుందని ఆయన ఆరోపించారు. ఆ ప్రభుత్వ పాఠశాలలో ఇంప్లిమెంట్ చేయడానికి అధికారులు కూడా ముందుకు రాలేదు అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల అభివృద్ధికి సహకరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో  అవసరమైతే  మీ విద్యాధికారులు ఆఫీసుల  ముందు ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధమవుతమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు ఉమేష్, మల్లికార్జున ,రమణ, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts