YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్‌ ప్రభంజనాన్ని ఆపలేరు..! - ఎమ్మెల్యే ఆదిమూలం

జగన్‌ ప్రభంజనాన్ని ఆపలేరు..! - ఎమ్మెల్యే ఆదిమూలం

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ చౌదరి ఎన్ని కుయుక్తులు చేసినా.. చంద్రబాబు ఎన్ని రకాలుగా అడ్డుతగిలినా పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని ఆపలేరని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు. గురువారం వరదయ్యపాలెం, సత్యవేడు, బుచ్చినాయుడుకండ్రిగ మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కోనేటి  ఆదిమూలం, వైసీపీ యువజన నాయకుడు, నారాయణం సింగిల్ విండో ప్రెసిడెంట్ కోనేటి సుమన్ పంచాయతీ ఎన్నికల్లో కొనసాగుతున్న నామినేషన్ పర్వం, ఏకగ్రీవాలు, వైసీపీ మద్దతుదారులు అనుసరిస్తున్న విది విధానాల గురించి  ఆరా తీశారు.. అనంతరం వరదయ్యపాలెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే ఆదిమూలం... సత్యవేడు నియోజకవర్గంలోని కెవిబిపురం, బుచ్చినాయుడు కండ్రిగ , వరదయ్యపాలెం , నాగలాపురం ,పిచ్చాటూరు , సత్యవేడు మండలాలలో  159 పంచాయతీలకు నాలుగో దఫా జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు విజయ కేతనాన్ని ఎగరవేస్తారని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.ఏకగ్రీవాలు జరిగితే లభించే ప్రోత్సాహకాలతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్న సదుద్దేశంతో ప్రభుత్వం ఏకగ్రీవాలపై ప్రకటన చేస్తే, దానికి దురుద్ధేవాలను ఆపాదిస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్‌ఈసీ ఆధ్వర్యంలో ఏకగ్రీవాలను అడ్డుకొని గ్రామాల్లో ప్రశాంతతకు భగ్నం కలిగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల్లో అధికార పార్టీకి నష్టం కలిగించి, ఇతర పార్టీలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎస్‌ఈసీ పని చేస్తున్నారని నిప్పులు చేరిగారు.ముఖ్యమంత్రి జగన్‌ రాజకీయాల్లో పెను మార్పులు తెచ్చారు. మెరుగైన, అవినీతి రహిత పాలనపై దృష్టి పెట్టారు. వ్యవస్థల్లో మార్పులు తెచ్చారు. ఎన్నో పథకాలు తెచ్చారు. దీర్ఘకాలిక సంస్కరణలతో ప్రజల జీవితాల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. కాబట్టే ఫలితాలు వైఎస్సార్‌సీపీకి ఏకపక్షంగా ఉంటాయనేది సుస్పష్టం. చంద్రబాబు దీన్ని గుర్తించాలి. రాజకీయం ప్రజలకు సంబంధించిందని చంద్రబాబు ఎప్పుడూ అనుకోలేదు. ప్రజా సమస్యలను ప్రస్తావించాలి. ప్రభుత్వ కార్యక్రమాల్లో లోపాలుంటే మాట్లాడాలి. నిర్మాణాత్మక విమర్శలు చేయాలి. తప్పుడు దారిలో అవాస్తవాలు ప్రచారం చేస్తే ఫలితాలు పంచాయతీ ఎన్నికల మాదిరిగానే ఉంటాయి. మరో 40 నెలల్లో ప్రజలకు ఏం చేయాలో సీఎం జగన్‌కు స్పష్టత ఉందని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు. రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఐకమత్యంగా ఉండటం ద్వారా గ్రామాలు ప్రగతి బాట పట్టాలని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష, ఆశయం. గ్రామ స్వరాజ్య స్థాపన కోసం కలలుగన్న జాతిపిత మహాత్మాగాంధీ కూడా ఇదే కోరుకున్నారు. గ్రామస్తులంతా రాజకీయాలకు అతీతంగా ఐక్యతాభావంతో కలసి, మెలసి పరస్పర సుహృద్భావ వాతావరణంలో గ్రామాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని, స్వపరిపాలన సాగించుకోవాలని రాజ్యాంగ నిర్మాతలు కూడా సూచించారు. ఈ లక్ష్యంతోనే గాంధీజీ సొంత రాష్ట్రమైన గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు గ్రామ పంచాయతీల ఎన్నికలను పార్టీ రహితంగా నిర్వహించేలా పంచాయతీరాజ్‌ చట్టంలో నిబంధన పెట్టాయి. రాజకీయ పార్టీల వారీగా గ్రామాల్లో వర్గాలు ఏర్పడితే మనస్పర్థలు వస్తాయని, గ్రామ ప్రగతిపై ఇవి దుష్ప్రభావం చూపుతాయన్న ఆలోచనతోనే పార్టీ రహిత ఎన్నికలకు బీజం వేశాయి అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వైసీపీ శ్రేణులు అంత ఐక్యంగా ఉండి ఏకగ్రీవం వైపు ముగ్గు చూపి ప్రభుత్వం ప్రకటించిన నజరానాతో గ్రామంలో అభివృద్ధికి బాటలు వేయాలన్నారు... ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

Related Posts