ధర్మపురిలో ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందిన ఒక పుణ్యక్షేత్రం. ధర్మపురి, చారిత్రాత్మకంగా గొప్ప కవులు, తత్వవేత్తలు, సంగీతం, కళ, నృత్య అలంకరించబడిన మహా పుణ్యక్షేత్రం. తెలంగాణ రాష్ట్రంలో ఉంది.రాజు ధర్మవర్మ, అది ధర్మరాయ గతంలో ధర్మపురం, ధర్మనపురం, దంమంవురు, ధర్మవురా, ధర్మపురం అని పిలిచేవారు తర్వాత ఇప్పుడు ధర్మపురిగా పిలుస్తారు. ఇది పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న దేవాలయాలు, కళాకారులకు ప్రసిద్ధి ధర్మపురి క్షేత్రం .దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రెండు దేవాలయాలు ఉన్నాయి. 14 వ, 15వ శతాబ్దాలలో బహమనీ, కుతుబ్ షాహీ, వ్యతిరేక హిందూమతం యొక్క తదుపరి దశలో పతనం ఔరంగజేబు ప్రారంభించారు తర్వాత. తన సహచరులను కూడా తన అడుగుజాడల్లో నడిచారు. రుస్తుమ్దిల్ఖాన్, హైదరాబాద్ సుబేదార్, ఒక లక్ష్మి నరసింహ స్వామి ఆలయం మార్చబడుతుంది. 1448 AD లో, క్రొత్త దేవాలయం మసీదు సమీపంలో అరవై స్తంభాలు నిలబెట్టింది ఎస్ట ఆలయం పాత నరసింహ స్వామి గుడి97 అని పిలుస్తారు. 1725 AD లో, లార్డ్ నరసింహ యొక్క చిహ్నంగా ధర్మపురి గ్రామ సమీపంలో కనుగొనబడింది.
ధర్మపురి పట్టణం గురించి జగిత్యాల్ నుండి -30 కిమీ, గోదావరి నది బ్యాంక్ సౌత్ సెంట్రల్ రైల్వే కాజీపేట-బల్హర్శ విభాగంనా మంచేరియాల్ రైల్వే స్టేషన్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నది దక్షిణ వాహిని [దక్షిణ ప్రవహించే]గా నది అందువల్ల దక్షిణ ఉత్తర వాహిని అని అంటారు.
ధర్మపురికి పొతే యమపురి ఉండదు అని చెబుతుంటారు.తెలంగాణ రాష్ట్రములో ప్రసిద్ధి గాంచిన నరసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం కరీంనగర్ పట్టణ కేంద్రానికి 75 కి మీ దూరంలో ఉంది. పవిత్ర గోదావరి నది తీరాన వెలసిన శివకేశవుల నిలయమైన ఈ క్షేత్రం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం, శ్రీ రామలింగేస్వరలయం, మసీదులు ప్రక్క ప్రక్కనే ఉన్నాయి అనాది నుంచి శైవ, వైష్ణవ, ముసిలం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి ఉంది. ఇక్కడ స్వామి వారు యోగానంద నరసింహ స్వామి భక్తుల కోరికలను నేరవేరుస్తున్నాడు.
యమలోకంలో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ క్షణం తీరిక లేని యమ ధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకొని ఆలయం నివాసం ఏర్పర్చుకున్నట్లు పురాణం గాథలు చెబుతున్నాయి. ఆలయ ద్వారం కుడి వైపున యమ ధర్మరాజు విగ్రహం ఉంటుంది. యమ ధర్మరాజుని దర్శించుకొని నృసింహుడిని దర్శించుకోవడం ఆనవైతి. పూర్వం ధర్మవర్మ అనే రాజు ధర్మ ప్రవర్తుడై ప్రజలందరినీ ధర్మ మార్గంలో నడిపించి నలుగు పాదముల ధర్మంతో ఈ క్షేత్రాన్ని పరిపలించినందుకు ధర్మపురి పేరు వచ్చింది అని పురాణాలో చేప్పారు.ధర్మపురిలో ఒక ప్రత్యేకత ఉంది అది యమ ధర్మరాజు ఆలయం.
నారసింహుడిని అష్టదిగ్బంధనం చేసిన హనుమంతుడు ఇక్కడే, తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మపురి అనేక అద్భుతాలకు నిలయం. ఈ పుణ్యక్షేత్రంలో ప్రధాన దైవమైన నరసింహుడిని క్షేత్రపాలకుడైన ఆజనేయుడు అష్టదిగ్భందన చేసి ఉంటాడు. అందువల్లే ఈ క్షేత్రం భూత, ప్రేత, పిశాచాల నుంచి బాధింపబడే వారికి ఉపశమనం కలిగిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ కారణం వల్లే ఈ క్షేత్ర సందర్శనకు సుదూర ప్రాంతం నుంచి కూడా వేలాది మంది భక్తులు నిత్యం వస్తుంటారు. ఇక ఇదే దేవాలయంలో అరుదుగా కనిపించే బ్రహ్మదేవుడికీ, దాదాపు కనిపించని యమధర్మరాజుకీ కూడా ఉపాలయాలు ఉన్నాయి. అదే విధంగా ఈ ధర్మపురి పుణ్యక్షేత్రంలోని తీర్థాల్లో పుణ్య స్నానాలు చేయడానికి భక్తులు ఉవ్విళ్లూరుతుంటారు. ఈ నేపథ్యంలో ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించిన కథనాలు...
క్షేత్రపాలకుడు ఆంజనేయుడు :
పూర్వం ధర్మవర్మ అనే మహారాజు ఈ ధర్మపురి క్షేత్రంలో ఆ నరసింహుడి గురించి తపస్సు చేస్తాడు. రాజు తపస్సుకు మెచ్చిన లక్ష్మీనారసింహుడు ఆ ధర్మవర్మ కోరిక మేరకు లక్ష్మీ సమేతుడై యోగ నరసింహుడి రూపంలో ఈ ధర్మపురిలో కొలువై ఉన్నాడు. ఈ ధర్మపురి పుణ్యక్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి
శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగం :
అందువల్లే నిత్యం ఈ క్షేత్రాన్ని వేలాది మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. శ్రీరామ చంద్రుడు వనవాస సమయంలో ఈ ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని సందర్శించాడని చెబుతారు. శ్రీరాముడు ఇక్కడ ప్రతిష్టించిన శివలింగాన్ని కూడా మనం చూడవచ్చు.
హరిహర క్షేత్రం :
రాముడు ప్రతిష్టించిన లింగం కాబట్టి ఈ ధర్మపురిలోని శివుడిని రామలింగేశ్వరుడిగా కొలుస్తాం. ఇది సైతక శిల్పం కావడం విశేషం. దీంతో ఈ ధర్మపురి హరిహర క్షేత్రంగా విరాజిల్లుతోంది. బ్రహ్మదేవుడు ఇక్కడ తన బ్రహ్మదండముతో భూమిని తవ్వి ఒక గుండాన్ని (తీర్థాన్ని) ఏర్పరుస్తాడు.
త్రిమూర్తుల క్షేత్రం:
అటు పై అందులో స్నానం చేసి నరసింహుడిని దర్శించుకొని ఆయన్ను ఆరాధిస్తాడు. అటు పై ఇక్కడే కొలువుండిపోతాడు. అందువల్లే ఇక్కడ బ్రహ్మ ఉపాలయాలన్ని కూడా చూడవచ్చు. అందువల్ల దీనిని త్రిమూర్తుల క్షేత్రం అని కూడా అంటారు.
యమధర్మరాజు:
రోజు పాపులను చూసిచూసి వారికి శిక్షలు వేసిన యమధర్మరాజుకు కూడా పాపం అంటుకొంటుంది. దీంతో విసుగు చెందిన యమధర్మరాజు నారదుడి సూచన మేరకు ఇక్కడి గోదావరిలో స్నానం చేసి నరసింహుడిని పూజిస్తాడు.
నరసింహుడి అభయం:
దీంతో యమధర్మరాజుకు దర్శనభాగ్యం కల్పించిన నారసింహుడు ఇక పై ఎటువంటి పాపాత్ముడిని నీవు శిక్షించిన నీకు ఎటువంటి పాపం అంటుకోదని వరమిస్తాడు. అంతే కాకుండా తన క్షేత్రంలో యమధర్మరాజుకు కూడా స్థానం కల్పిస్తాడు.
అప మృత్యుదోషం;
అందువల్లే ఈ ధర్మపురి క్షేత్రంలో మనం యమధర్మరాజు ఉపాలయాన్ని కూడా చూడవచ్చు. ఇక యముడి ఉపాలయం దగ్గరగా ఉన్న గండ దీపంలో నూనె సమర్పించిన వారికి అప మృత్యుదోషం ఉండదని, మృత్యు భయం ఉండదని ప్రతీతి.
యమకుండం :
యమధర్మరాజు స్నానం చేసిన ప్రదేశానికి యమకుండమని పేరు. ఇక తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడం కోసం మూడు పిడికిళ్ల ఇసుకతో సత్యవతి అనే మహిళ నిర్మించిన ఇసుక స్తంభం కూడా మనం చూడవచ్చు.
వందల ఏళ్లనాటి :
ఇది వందల ఏళ్ల పూర్వం నాటిదని చెబుతారు. ఆ సత్యవతి స్నానం చేసిన కుండాన్ని సత్యవతీ కుండంగా చెబుతారు. దంపతులు సరిగంగ స్నానాలు చేసి నరసింహుడిని దర్శిస్తే అత్యంత ఫలప్రదమని స్థానికుల నమ్మకం. అందువల్లే నిత్యం ఈ క్షేత్రాన్ని వేలాది మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. శ్రీరామ చంద్రుడు వనవాస సమయంలో ఈ ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని సందర్శించాడని చెబుతారు. శ్రీరాముడు ఇక్కడ ప్రతిష్టించిన శివలింగాన్ని కూడా మనం చూడవచ్చు. రాముడు ప్రతిష్టించిన లింగం కాబట్టి ఈ ధర్మపురిలోని శివుడిని రామలింగేశ్వరుడిగా కొలుస్తాం. ఇది సైతక శిల్పం కావడం విశేషం. దీంతో ఈ ధర్మపురి హరిహర క్షేత్రంగా విరాజిల్లుతోంది. బ్రహ్మదేవుడు ఇక్కడ తన బ్రహ్మదండముతో భూమిని తవ్వి ఒక గుండాన్ని (తీర్థాన్ని) ఏర్పరుస్తాడు. అటు పై అందులో స్నానం చేసి నరసింహుడిని దర్శించుకొని ఆయన్ను ఆరాధిస్తాడు. అటు పై ఇక్కడే కొలువుండిపోతాడు. అందువల్లే ఇక్కడ బ్రహ్మ ఉపాలయాలన్ని కూడా చూడవచ్చు. అందువల్ల దీనిని త్రిమూర్తుల క్షేత్రం అని కూడా అంటారు రోజు పాపులను చూసిచూసి వారికి శిక్షలు వేసినయమధర్మరాజుకు కూడా పాపం అంటుకొంటుంది. దీంతో విసుగు చెందిన యమధర్మరాజు నారదుడి సూచన మేరకు ఇక్కడి గోదావరిలో స్నానం చేసి నరసింహుడిని పూజిస్తాడు. దీంతో యమధర్మరాజుకు దర్శనభాగ్యం కల్పించిన నారసింహుడు ఇక పై ఎటువంటి పాపాత్ముడిని నీవు శిక్షించిన నీకు ఎటువంటి పాపం అంటుకోదని వరమిస్తాడు. అంతే కాకుండా తన క్షేత్రంలో యమధర్మరాజుకు కూడా స్థానం కల్పిస్తాడు. అందువల్లే ఈ ధర్మపురి క్షేత్రంలో మనం యమధర్మరాజు ఉపాలయాన్ని కూడా చూడవచ్చు. ఇక యముడి ఉపాలయం దగ్గరగా ఉన్న గండ దీపంలో నూనె సమర్పించిన వారికి అప మృత్యుదోషం ఉండదని, మృత్యు భయం ఉండదని ప్రతీతి. యమధర్మరాజు స్నానం చేసిన ప్రదేశానికి యమకుండమని పేరు. ఇక తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడం కోసం మూడు పిడికిళ్ల ఇసుకతో సత్యవతి అనే మహిళ నిర్మించిన ఇసుక స్తంభం కూడా మనం చూడవచ్చు.
వందల ఏళ్లనాటి ఇసుక స్తంభం :
ఇది వందల ఏళ్ల పూర్వం నాటిదని చెబుతారు. ఆ సత్యవతి స్నానం చేసిన కుండాన్ని సత్యవతీ కుండంగా చెబుతారు. దంపతులు సరిగంగ స్నానాలు చేసి నరసింహుడిని దర్శిస్తే అత్యంత ఫలప్రథమైన ఫలితాలు వస్తాయి అని స్థానికుల నమ్మకం.
ఓం నమో నారాయణాయ
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో