YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఉత్తరాంధ్రలో ఊపువచ్చిందా

ఉత్తరాంధ్రలో ఊపువచ్చిందా

విజయనగరం, ఫిబ్రవరి 12, లుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటి ఉత్తరాంధ్ర జిల్లాలు 2019 ఎన్నికల్లో ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నాయి. జగన్ మీద మోజుతో మొత్తం జనమంతా ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు. ఈ దెబ్బకు విజయనగరం జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు టీడీపీకి దక్కకుండా పోయింది. ఇక విశాఖ సిటీ కాస్తా పరువు కాపాడితే శ్రీకాకుళంలో కింజరాపు ఫ్యామిలీ సైకిల్ పూర్తిగా కిల్ కాకుండా ఆపింది. ఈ నేపధ్యంలో వచ్చిన పంచాయతీ ఎన్నికల మీద చంద్రబాబు చాలా పెద్ద ఆశలే పెట్టుకున్నారు.ఉత్తరాంధ్రాలోని విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం కలుపుకుని 2800 వరకూ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 973 ఉంటే విజయనగరం 920, విశాఖలో 925 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో మెజారిటీని చేజిక్కించుకోవాలని టీడీపీ గట్టి ఆలోచనలే చేస్తోంది. ఈనాటి పంచాయతీ ఎన్నికలలో గెలుపే రేపటి అసెంబ్లీ ఎన్నికలకు పునాది కాబట్టి ఇక్కడ నుంచే బలం పెంచుకోవాలని టీడీపీ అధినాయకత్వం వ్యూహాలను రచించింది. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి అలా ఉందా అన్నదే ప్రశ్న.అధికార వైసీపీకి గ్రామీణ ప్రాంతాలలోనే బలం ఎక్కువగా ఉంది. పైగా వాలంటీర్ల వ్యవస్థతో జన్మభూమి కమిటీలను పోలిక పెట్టి మరీ జనం చూస్తున్నారు. ఆనాడు పెన్షన్ కావాలన్నా పధకాలు దక్కాలన్నా జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదన్న సంగతిని గుర్తు చేసుకుంటున్న వారూ ఉన్నారు. ఇపుడు చూస్తే వైసీపీకి వ్యతిరేకత ఉందని, ఆ పార్టీని జనాలు చిత్తుగా ఓడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు ఇస్తున్నా గట్టిగా రెండేళ్ళు కూడా కానీ జగన్ ఏలుబడి మీద మోజు తగ్గిందనుకుంటే పొరపాటే అంటున్నారు. ఇక టీడీపీ తరఫున అభ్యర్ధులే పోటీకి రాని పరిస్థితి కూడా చాలా చోట్ల ఉంది. ఇదే సందు అన్నట్లుగా సీనియర్ నేతలు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉంటే మరి కొందరు ఏకంగా పార్టీకే రాజీనామా చేస్తున్న వైనం కనిపిస్తోంది.ఇక ఎంత చూసుకున్నా కూడా పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకే మెజారిటీ సర్పంచులు దక్కుతారు అన్నది ఒక విశ్లేషణ. మూడు జిల్లాల్లో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఉండడమే కాకుండా అధికారం కూడా చేతిలో ఉండడం వైసీపీకి మరో అడ్వాంటేజ్. ఇక టీడీపీ తరఫున పోటీకి ఎవరైనా ముందుకు వచ్చినా కూడా వారికి ఆర్ధికంగా ఇతరత్రా అండదండలు అందించే నాధుడు, నాయకులే ఇపుడు ఆ పార్టీలో గట్టిగా కనిపించడం లేదు. మొత్తానికి చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్రాలో గత వైభవం రావాలంటే ఏదైనా అద్భుతం జరగాలనే అంటున్నారు. ఇక తమ్ముళ్ల మాటలలో చెప్పాలంటే గత సార్వత్రిక ఎన్నికల కంటే కొంత బలపడినా అదే పదివేలు అన్నట్లుగానే సీన్ ఉంది మరి

Related Posts