YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

చిరాగ్ దారెటు...

చిరాగ్  దారెటు...

పాట్నా, ఫిబ్రవరి 12, 
లోక్ జన్ శక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ కు రాజకీయంగా ఇక అవకాశాలు లేనట్లే. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉన్నంత వరకూ ఆయనకు ఎటువంటి అవకాశాలు రావన్నది వాస్తవం. రామ్ విలాస్ పాశ్వాన్ మరణించేంత వరకూ కేంద్ర మంత్రిగా కొనసాగారు. ఎన్డీఏతో సత్సంబంధాలు కొనసాగించారు. రామ్ విలాస్ పాశ్వాన్ మరణంతో ఖాళీ అయిన మంత్రి పదవి చిరాగ్ పాశ్వాన్ కు దక్కుతుందని ఊహించారు.
అయితే బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ ఊహలన్నింటికి ఫుల్ స్టాప్ పడినట్లే. ఎందుకంటే ఎన్డీఏలో చిరాగ్ పాశ్వాన్ కు ఎటువంటి అవకాశాలు ఇవ్వరాదన్నది నితీష్ కుమార్ షరతుగా ఉంది. ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీహార్ బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ పక్షాల సమావేశం జరిగింది. ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న చిరాగ్ పాశ్వాన్ పార్టీకి ఈ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం పంపారు. అయితే నితీష్ కుమార్ వత్తిడితో చివరి నిమిషంలో బీజేపీ వెనక్కు తగ్గింది. ఆయనకు పంపిన ఆహ్వానాన్ని తిరిగి వెనక్కు తీసుకుంది.బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో ఉన్న చిరాగ్ పాశ్వాన్ కుచెందిన లోక్ జన్ శక్తి పార్టీ విడిగా పోటీ చేసింది. అదీ కేవలం జేడీయూ పోటీ చేసిన అభ్యర్థులపైనే బరిలోకి దింపింది. ఒక సామాజిక వర్గం ఓట్లను చీల్చడంతోనే జేడీయూ ఎక్కువ స్థానాలను దక్కించుకోలేకపోయింది. అందుకే చిరాగ్ పాశ్వాన్ పై నితీష్ కుమార్ ఆగ్రహంతో ఉన్నారు. ఆయనను ఎన్డీఏ నుంచి తొలగించాలని నితీష్ కుమార్ వత్తిడి తెస్తున్నారు.అయితే చిరాగ్ పాశ్వాన్ విషయంలో ఇంతవరకూ బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. బీహార్ ఎన్నికల సమయంలో బీజేపీకి ఎటువంటి హాని తలపెట్టకుండా ఉన్నందుకే బీజేపీ ఆయన విష‍యంలో నోరు మెదపడం లేదు. ఇందుకు నితీష్ కుమార్ వత్తిడి కారణమంటున్నారు. రామ్ విలాస్ పాశ్వాన్ మృతితో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని కూడా ఆ పార్టీకి ఇవ్వలేదు. దీంతో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకూ చిరాగ్ నుబీజేపీ చేరదీసే ప్రసక్తి లేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Related Posts