YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బెంగాల్ ఫీల్డ్ లెక్కలేంటీ..

బెంగాల్ ఫీల్డ్ లెక్కలేంటీ..

కోల్ కత్తా, ఫిబ్రవరి 12, 
వరుసగా ఫెయిలవుతూనే ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్నారు. హర్యానాలో గెలవలేకపోయినా ఇతర పార్టీల మద్దతుతో అధికారంలోకి రాగలిగారు. ఇక తాజాగా జరిగిన బీహార్ లో గెలుపు బీజేపీ ది అనడం అంత బాగుండదేమో. ఎందుకంటే బలమైన కూటమిగా చెప్పుకునే జేడీయూ, బీజేపీ కలసి పోటీ చేసినా అనుకున్న స్థానాల్లో విజయం సాధించలేకపోయింది. ఇలా అన్ని రాష్ట్రాలు వరసగా బీజేపీకి దెబ్బతీస్తూనే ఉన్నాయి. మహారాష్ట్రలో గెలిచినా అధికారంలోకి రావడానికి వీలుపడలేదు. అలాంటిది పశ్చిమ బెంగాల్ లో సాధ్యమవుతుందా? ఇప్పుడు ఈ అనుమానం అన్ని పార్టీల్లోనూ కలుగుతుంది.మమత బెనర్జీని ఒంటరిని చేసి కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆడుకుంటున్నారన్న విమర్శలను బీజేపీ ఇప్పటికే ఎదుర్కొంటుంది. వరసగా తృణమూల్ కాంగ్రెస్ నేతలను పార్టీలోకి చేర్చుకుంటుండటంతో మమత బెనర్జీ పై సానుభూతి ఎక్కువవుతుందంటున్నారు. మమత బెనర్జీని బెంగాలీలు లోకల్ గా చూస్తున్నారు. అయితే బీజేపీ శృతిమించి చేస్తున్న రాజకీయంతో మమత బెనర్జీకి బ్యాటిల్ ఫీల్డ్ అనుకూలంగా మారిందంటున్నారు.ఇప్పటికే బీజేపీ ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకుంటుండటంతో ఫుల్ జోష్ లో ఉన్నట్లు బయటకు కన్పిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థిితి కన్పించడం లేదు. మమత బెనర్జీని నేరుగా ఎదుర్కొనలేక ఇటు గవర్నర్, అటు పార్టీ నేతలను చేర్చుకోవడం ద్వారా ఇబ్బందులు పెట్టడంపై క్షేత్రస్థాయిలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మమత బెనర్జీ కూడా దీనిని ధీటుగానే ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. తాను బీజేపీకి భయపడేది లేదని, ఎంతమందిని తీసుకెళతారో తీసుకెళ్లమని బీజేపీకి సవాల్ విసురుతున్నారు.నిజానికి ఇప్పటి వరకూ వెళ్లిన టీఎంసీ నేతల్లో ఒక్క సువేంద్ర అధికారి మాత్రమే బలమైన నేత. మిగిలన చోట్ల నేతలు వెళ్లారు తప్పించి క్యాడర్ వెళ్లలేదని మమత బెనర్జీ చెబుతున్నారు. నిజంగా కూడా క్షేత్రస్థాయిలో క్యాడర్ ఎవరూ వెళ్లకుండా టీఎంసీలోనే ఉన్నారు. ఇక నందిగ్రామ్ లో తాను పోటీకి దిగుతానని ప్రకటించడం వెనక కూడా క్యాడర్ కు ధైర్యం చెప్పే ప్రయత్నమేనంటున్నారు. మొత్తం మీద ఎంత మందిని చేర్చుకున్నా ఫలితం తమవైపు ఉంటుందని మమత బెనర్జీ చెబుతున్నారు. బీజేపీ మాత్రం చేరికలతోనే తమ బలం పెరుగుతుందని భావిస్తుంద. చూడాలి ఏం జరుగుతుందో?

Related Posts