YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మహిళా రైతు బజార్ కు ఆదరణ

మహిళా రైతు బజార్ కు ఆదరణ
గాజువాకలో 2012లో మహిళా రైతుల కోసం రాష్ట్రంలోనే మొదటిసారిగా మహిళా రైతుబజారు ఏర్పాటు చేశారు. దీనికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. దీన్ని 2000 సంవత్సరంలో 90 సెంట్లు విస్తీర్ణంలో ఏర్పాటు చేసినా మామూలు బజారుగానే కొనసాగింది. తరువాత కాలంలో ప్రభుత్వం దీన్ని మహిళా రైతు బజారుగా ప్రకటించింది. అప్పటి నుంచి మహిళా రైతులే అమ్మకాలు చేస్తున్నారు. కోటపాడు, నర్సీపట్నం, సబ్బవరం, కశింకోట, పెందుర్తి, సంతపాలెం, కె.కోటపాడుల నుంచి మహిళా రైతులు ఉదయం 5 గంటలకు చేరుకొని రోజంతా అమ్మకాలు సాగిస్తున్నారు. మొత్తం 43 మంది రైతులు ఇలా జీవనోపాధి పొందుతున్నారు. బజారులో అమ్మకందారులంతా మహిళలే. ఉదయం కూరగాయల సరుకు తెచ్చుకున్నది మొదలు రాత్రి వరకూ వారే దుకాణాల్లో అన్ని పనులూ చేసుకుంటారు. నాణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరలకే విక్రయిస్తారు. అందుకే పారిశ్రామిక ప్రాంత వాసులకు ఆ మార్కెట్‌ అంటే రోజురోజుకూ మరింత ఇష్టం ఏర్పడుతోంది. రైతు బజారుకు మమూలు రోజుల్లో 1100 మంది కాయగూరలు కొనుగోలు చేయడానికి వస్తారు. పండగలు, సెలవు దినాల్లో అయితే ఆ సంఖ్య 2 వేలకు పైచిలుకు చేరుతుంది. రోజుకు 70 క్వింటాల కాయగూరలు అమ్మకాలు చేస్తారు. నాణ్యమైన ఉత్పత్తులను విక్రయిస్తుండటంతో పలువురు మన్ననలు ఈ బజారుకు దక్కుతున్నాయి. ప్రభుత్వం వీరి దగ్గర నుంచి అమ్మకానికి సంబంధించి ఎలాంటి రుసుమూ వసూలు చేయడం లేదు. అందుకే బయట ప్రాంతాలకన్నా కాస్త తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈ రైతు బజారులో అన్ని రకాల కాయగూరలు లభిస్తాయన్నది అందరి నమ్మకం. అందుకే ఏ చిన్న ఫంక్షన్‌ జరిగినా చటుక్కున ఇక్కడకు వచ్చి ముందుగానే కొంతమంది ఆర్డర్లు ఇచ్చేస్తుంటారు. కొత్త గాజువాక, పాత గాజువాక చినగంట్యాడ, శ్రీనగర్‌, పంతులుగారి మేడ, జోగవానిపాలెం, ఇందిరాకాలనీ, సమతానగర్‌, సనత్‌నగర్‌, అజిమాబాద్‌ తదితర ప్రాంతాలకు దగ్గరగా ఉండడం వల్ల ఈ బజారుకు తాకిడి ఎక్కువుగా ఉంటుంది..

Related Posts