YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 ఇంటివద్ధకే రేషన్ విధానాన్ని రద్దుచేయాలి :-డీసీసి

 ఇంటివద్ధకే రేషన్ విధానాన్ని రద్దుచేయాలి :-డీసీసి

 ఇంటివద్ధకే రేషన్ విధానాన్ని
రద్దుచేయాలి
:-డీసీసి
కర్నూలు  ఫిబ్రవరి 12, 
ఇంటి వద్దకె రేషన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ అహమ్మద్‌ అలీఖాన్ గారు ఒక  ప్రకటనలో తెలియజేశారు . మీ ఇంటికి మీ రేషన్ విధానం  వల్ల ప్రభుత్వానికి ఏడు వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతుందని మరియు వారు చెప్పిన రోజు మాత్రమే వీది చివర వాహనం కోసం క్యూలో నిలబడాల్సి వస్తుందని ఇంటి వద్దకు రేషన్ కావాలి అని అడగలేదని   మాకు రేషన్ షాపులో బాగుంటుందని మాకు వీలున్నప్పుడు వెళ్లి అందుబాటులో ఉన్న రేషన్ షాపుకు వెళ్లి రేషన్ తెచ్చు కునే వారమనీ మహిళలు బాధ పడుతున్నారని   వాహనాన్ని వీది కూడలిలో నిలబెట్టి పంపిణీ చేయడం వల్ల మగవాళ్లు పనులకు వెళ్లడం వల్ల మహిళలు గంటల తరబడి క్యూలలో నిలబడి రేషన్ తీసుకోవాల్సి వస్తుందని అంటున్నారని వచ్చేది ఎండాకాలం అని  కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సమస్యలను తెలుసుకొని గతంలో మాదిరిగానే రేషన్ షాపు నందు రేషన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని అలాగే ఎండియూ వాహనదారులకు స్వయం ఉపాధి కింద వారి వాహనాలను వారికే ఇవ్వడం వల్ల వారి కుటుంబాలకు మేలు చేసిన వారవుతారని ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అహమ్మద్ అలీ ఖాన్ గారు ఒక పత్రికా ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

Related Posts