బేడ బుడగ జంగం కులమునకు న్యాయం చేయాలి
తూర్పాటి మనోహర్
కర్నూలు ఫిబ్రవరి 12,
కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో 9 ఫిబ్రవరి 2021 నా వైసీపీ ఎంపీ వంగా గీత విశ్వనాథం, టిఆర్ఎస్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యుడు రేవంత్ రెడ్డి, అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక శాఖ మంత్రి రతన్ లాల్ కటారియా సమాధానం తెలియజేస్తూ, SC ఎబిసిడి వర్గీకరణ కోర్టులో పరిధిలో ఉన్నదని, అలాగే ఆంధ్ర ప్రదేశ్ నుండి బేడ బుడగ జంగం సామాజిక వర్గం షెడ్యూల్ క్యాస్ట్ లో పొందు పరచాలని, ప్రతిపాదన రావడం జరిగిందని, కానీ సంపూర్ణ నివేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపాలని తెలియజేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఆ ప్రతిపాదన రాలేదని సమాధానం తెలియజేశారు. కనుక వీటిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయం జరిగేలా చూడాలని, ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం అధ్యక్షులు తూర్పాటి మనోహర్. మరియు కమిటీ బృందం ద్వారా గౌ" ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తమ ఇచ్చిన మాట మేరకు అలాగే గౌ" జేసీ శర్మ కమిషన్ విచారణ ఫైనల్ రిపోర్ట్ తేదీ:- 8 జూన్ 2020 నా ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. వీటిపై తక్షణమే "కేంద్రం ఏ సూచనలు కోరిందో, ఆ సూచనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలని మనవి చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో విద్యా, సంక్షేమ పరంగా నష్టం జరగకుండా "ప్రత్యేకంగా సర్క్యులర్ జారీ" చేసే విధంగా చూడాలని ప్రియతమ ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాము. ఈ కార్యక్రమాన్ని కర్నూల్ టౌన్ దేవ నగర్ నందు ముఖ్య కార్యకర్తల సమావేశంలో తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ధూపము చిన్న రాముడు, .మద్దిలేటి, పెద్ద చింతల య్య, ఈశ్వరయ్య, దూపం. మాధవరావు, రుద్రాక్షల పకీరప్ప, సిరిగిరి జమ్మన్న, మోతే జమ్మన్న, వీరన్న, మొదలగు వారు పాల్గొన్నారు.