YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఉక్కు దీక్షలో గంటా శ్రీనివాసరావు

ఉక్కు దీక్షలో గంటా శ్రీనివాసరావు

ఉక్కు దీక్షలో గంటా శ్రీనివాసరావు
విశాఖపట్నం ఫిబ్రవరి 12,
ఉత్తరాంధ్ర ప్రజల గుండె చప్పుడు స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం కార్మిక సంఘాలు చేపట్టిన దీక్షలో పాల్గొన్న గంటా శ్రీనివా సరావు హాట్ కామెంట్స్ చేశారు.ఈ దీక్షలో పాల్గొనడం ఆనందదాయకంగా ఉందని వెస్ట్ బెంగాల్ లో సింగూరు, విశాఖలో జిందాల్ పరిశ్రమలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేసి అడ్డుకున్న ఉద్యమ స్ఫూర్తిగా తీసుకొని స్టీల్ ప్లాంట్ ను కాపాడు కోవాలని చెప్పారు.విశాఖ లో ఎదిగిన వ్యక్తిని, బ్రతికిన వ్యక్తిని అందుకె స్టీల్ ప్లాంట్ కోసం రాజినామా చేశానని చెప్పారు.తెలంగాణ ఉద్యమం తరహా లో ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉండాలని ఎన్ని రాజకీయ పార్టీలు ఉండచ్చు కానీ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేసేది కార్మిక ఐక్య కార్యా చరణ కమిటే నని తెలిపారు. అత్య వసర కేబినెట్ ఏర్పాటు చేసి అఖిలపక్షం కమిటీ ఏర్పాటు చేసి ప్రధానిమంత్రి  కలిసే భాద్యత తీసుకోవాలని కోరారు.మిలీనియం మార్చ్ ను నిర్వహించి ఒక ప్రజా ఉద్యమంగా తీర్చి దిద్దాలని స్టీల్ ప్లాంట్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.నా రాజీనామా సరైన రీతిలో చేసి మరోసారి స్పీకర్ ఫార్మాట్ లో ఇస్తున్నానని రిలే నిరాహారదీక్ష శిబిరం వద్ద రిజైన్ చేసి, మీడియా ప్రతినిధులు సమక్షంలో లేఖ అందజేసారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.

Related Posts