YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేంద్ర నుంచి నిధులు తీసుకురావడం చాతకాదు  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

కేంద్ర నుంచి నిధులు తీసుకురావడం చాతకాదు  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

కేంద్ర నుంచి నిధులు తీసుకురావడం చాతకాదు 
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్ ఫిబ్రవరి 12,
 1947 తర్వాత  జీహెచ్ఎంసీ లో మేయర్,డిప్యూటీ మేయర్ గా  ఇద్దరు  మహిళలకు అవ్వడం ఇదే మొదటి సారి. మేయర్ జనరల్ మహిళా రిజర్వేషన్ అయినప్పటికీ ..బీసీ కి  టిఆర్ఎస్ మేయర్ అవకాశం ఇంచ్చింది. టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత వెనకబడిన వర్గాలకు అనేక అవకాశాలను కల్పించాం. ప్రతీది రాజకీయం చేయడం బీజేపీ కి అలవాటు అయింది. మణికొండ ,మక్తల్ లో బీజేపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోలేదా అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ ,రాజస్థాన్ లో బీజేపీ ఏం చేసిందో దేశ ప్రజలకు తెలియదా.  ఎక్స్ అఫిషియో సభ్యులు కలిపినా..బీజేపీ కి  49 ఓట్లు దాటవు. మా పార్టీ పూర్తి బలంతో నే మేయర్ ,డిప్యూటీ మేయర్ పదవి గెలిచుకున్నాం. ఎంఐఎం కు మేము డిప్యూటీ మేయర్ పదవి ఇస్తే..మీరు ప్రశ్నించండి. మహిళ కు మేయర్ రావడం బీజేపీ కి ఇష్టం లేదు. కేంద్ర నుంచి నిధులు తీసుకురావడం చాతకాదు కానీ ...విమర్శలు చేయడం అలవాటు అయిపోయింది. మీరేనా హిందువులు.. మేము కాదా. రోడ్లమీద తిరగడం మాకు చాతాకాదా. నల్గొండ ,వరంగల్ కూడా బీజేపీ నేతలు  రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు. ఎంఐఎం అంటరాని పార్టీ కాదు కదా....అలా అయితే ఎంఐఎం బ్యాన్ చేయండి. మా సహనాన్ని చేతగాని తనంగా చూస్తే ..ఊరుకోం. కరోనా సమయంలో ప్రధానమంత్రి ని విమర్శిస్తే...చర్యలు తప్పవని హెచ్చరించిన ముఖ్యమంత్రి మా కేసీఆర్ అని గుర్తు చేసారు. నోరు ఉంది కాదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే..ఊరుకునేది లేదు.. మా సంగతి ఏంటో చూపిస్తాం. మాకు మెజారిటీ లేకపోతే ...ఎంఐఎం సపోర్ట్ చేయలేదు.మాకు మద్దతు ఇవ్వాలని మేము ఏ పార్టీ తో సంప్రదింపులు జరపలేదు. బీజేపీ అంటె నచ్చిని వాళ్ళు మరో పార్టీ కి మద్దతు ఇస్తారు..తప్పేముంది. రైతు బంధు ,రైతు భీమా ,మిషన్ భగీరథ ,మిషన్ కాకతీయ లాంటి గొప్ప పథకాలు తెచ్చిన ప్రభుత్వం టిఆర్ఎసని అన్నారు. ఐటిఐఆర్ ప్రాజెక్టు గురించి ఏంధుకు మాట్లాడరు..కాంగ్రెస్ హాయాంలో అనుమతి వచ్చినా..ఏంధుకు అమలు చేయట్లేదు.
కేసీఆర్ కంటె గొప్ప హిందువు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా. ప్రభుత్వ ఖర్చు తో గుడి కట్టే ధైర్యం కేసీఆర్ కంటె ముందు ఎవరైనా చేసారా. జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో మాకు బలం లేనప్పుడు.. ఎంఐఎం సపోర్ట్ చేసుంటె...అప్పుడు బీజేపీ విమర్శిస్తే ఓక అర్థం ఉండేది. మెజారిటీ లేని బీజేపీ ఏంధుకు పోటీ చేసింది.. దీనికి సమాధానం ఏంధుకు చెప్పరు. కేంద్ర  మంత్రులు వస్తే..మేము గౌరవం ఇస్తలేమా..మీరు ఇవన్నీ ఏంధుకు చూడరు. మేము మద్దతు అడగలేదు... ఎంఐఎం సపోర్ట్ చేస్తే...మేమేం చేస్తాం. అసదుద్దీన్ ట్విట్ తో మాకు సంబంధం లేదని అన్నారు. షర్మిల పార్టీ పై నేను కామెంట్ చేయదలుచుకోలేదు. నల్గొండ గిరిజనుల దగ్గర డ్రామాలు చేసిన బీజేపీ... గిరిజన రిజర్వేషన్లు ఏంధుకు అమోదించట్లేదని మంత్రి ప్రశ్నించారు.

Related Posts