YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎంపీటీసీ, జడ్పీటీసి, మున్సిపల్ ఒకేసారి

ఎంపీటీసీ, జడ్పీటీసి, మున్సిపల్ ఒకేసారి

ఎంపీటీసీ, జడ్పీటీసి, మున్సిపల్ ఒకేసారి
విజయవాడ, ఫిబ్రవరి 12, 
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి దశ ఎన్నికల ప్రక్రియ పూర్తికాగా.. శనివారం రెండో దశకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 21తో మొత్తం ప్రక్రియ పూర్తి కానుంది. దీంతో ఏపీలో మరో కొత్త వాదన తెరపైకి వచ్చింది. త్వరలోనే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని ఊహాగానాలు మొదలయ్యాయి. గురువారం సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లకు ఎస్ఈసీతో సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణతో పాటూ మిగిలిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తొలిదశ తరహాలోనే మిగిలిన మూడు విడతల పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించాలని సీఎస్, డీజీపీలను ఎస్ఈసీ కోరారు.మరోవైపు వాయిదా వేసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహించాలని ప్రభుత్వం కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను ఎస్ఈసీ ముందు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. వరుసగా ఒకేసారి ఈ ఎన్నికలన్నీ పూర్తి చేయడంతో సమయం ఆదా అవుతుందని.. ఎన్నికల కోడ్‌ తలనొప్పి తగ్గుతుందన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పరిశీలించి నిర్ణయం తర్వాత చెబుతానని ఎస్ఈసీ అన్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈ నెల 23న షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని భావిస్తున్నారట.ఈ నెల 21తో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుంది కాబట్టి ఆ తర్వాత వాయిదా పడిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ ఫోకస్ పెడుతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. రేషన్ హోం డెలివరీ వాహనాలను ఎస్‌ఈసీ పరిశీలించిన సందర్భంలో, వాహనాలపై ఇప్పుడున్న రంగులు మార్చాలని ఇచ్చిన ఆదేశాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఉంటాయన్న సంకేతాలు ఇచ్చారు. దీంతో ఈ ఎన్నికలు కూడా త్వరలోనే జరగనున్నాయనే చర్చ జరుగుతోంది. ఒక వేళ ఎన్నికలు జరిపే ఉద్దేశం ఉంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలకు కొత్తగా మళ్లీ షెడ్యూల్‌ ప్రకటించి నోటిఫికేషన్‌ ఇస్తారా.. ఎక్కడ ఆగాయో అక్కడి నుంచి మళ్లీ మొదలు పెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై ఎస్ఈసీ ఎలా ముందుకు వెళుతుంది అన్నది చూడాలి.

Related Posts