YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఇచ్చోడ మండలం

ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఇచ్చోడ మండలం

బోథ్ నియోజక వర్గంలోనే ఇచ్చోడ మండల కేంద్రంలో పార్కింగ్ సమస్య తీ వ్రంగా మారింది. నాలుగు వరుసల జాతీయ రహదారికి అటు ఆదిలాబాద్‌కు, ఇటు నిర్మల్ జిల్లాలకు మార్గ మధ్యలో ఉండడం.. వివిధ పనుల నిమిత్తం ఇచ్చోడకు వచ్చే వారి వాహనాల తాకిడితో ప్రధాన వీధుల్లో ట్రాఫిక్ పద్మ వ్యూహంలా మారుతోంది. మాస్టర్ ప్లాన్ అమలు జరగకపోవడం, పార్కింగ్ సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉండటంతో సమ స్య రోజు రోజుకూ జటిలంగా మారుతోంది.ఇచ్చోడలో ప్రధాన రహదారికి ఎడమ వైపు 70 ఫిట్లు, కుడివైపు మరో 70 ఫిట్లు రహదారి ఉండేలా మాస్టర్ ప్లాన్‌లో ఉంది. ప్రస్తుతం 45 నుంచి 50 ఫీట్లకే పరిమితమైంది. ప్రస్తుతం ఉన్న రోడ్డులో చాలా వరకు ఆక్రమణలతో కుచించుకుపోయాయి. దీంతో ఈ రహదారులు చాలా ఇరుకుగా మారాయి. ఇలాంటి చోట్ల తరుచూ ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. మేజర్ గ్రామపంచాయతీ పాలకవర్గం, అధికార యంత్రాంగం, అఖిల పక్షం నాయకులు కలిసి సంయుక్తంగా చర్యలు తీసుకుని పార్కింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. ప్రధాన కూడళ్లలో కొందరు వ్యాపార రోడ్లను ఆక్రమించుకుని మరీ దుకాణాలను నిర్మిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు వ్యాపారులు ఏకంగా రోడ్డు వరకు సామగ్రిని పెడుతుండడంతో పాదచారులు, వాహనాలదారులు నిత్యం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇచ్చోడ మండల కేంద్రం కావడంతో పాటు ఏడీఏ సహాయ సంచాల కార్యాలయం, చిన్ననీటి పారుద ల శాఖ కార్యాలయం, కవ్వాల్ టైగర్ రిజర్వు కార్యాలయం, అటవీశాఖ కార్యాలయం, డీఎఫ్‌వో ప్రధా న కార్యాలయం, ప్రధాన బ్యాంక్‌లు, ఇతర వ్యాపా ర సముదాయాలు, ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు ఇతర ప్రైవేటు రంగ కార్యాలయాలు అధిక సంఖ్యలో ఉండడంతో పరిసర మండలాల నుంచే కాకుండా ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాల నుంచి ప్రజలు నిత్యం అధిక సంఖ్యలో వస్తుంటారు. దీంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ప్రధాన కూడళ్లయిన శివాజీ చౌక్, తాత్కాలిక బస్టాండ్, సిరిచెల్మ చౌరస్తా, కుమ్రం భీం చౌరస్తా, సిరికొండ చౌరస్తాల్లో ట్రాఫిక్ సమస్య జటిలంగా మారింది. ఉదయం, సాయంత్రం వేళల్లో తరచూ ట్రాఫిక్ స్తంభించి ఇబ్బందికరంగా తయారవుతోంది. ప్రధాన వీధుల్లో వాహనాలకు తగినట్లుగా పార్కింగ్ స్థలాలు లేకపోవడం, వీధుల వెడల్పు తక్కువగా ఉండడం సమస్యకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. రహదారులు ఇరుగ్గా ఉండడంతో దుకాణాల ముందే వాహనాలను నిలిపేస్తుండడంతో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది.పదేళ్ల కాలంలో ఇచ్చోడలో వాహనాల సంఖ్య మూ డింతలైంది. ఆదిలాబాద్‌కు, నిర్మల్‌కు మార్గ మధ్య లో అనుకూలంగా ఇచ్చోడ ఉండడంతో అధిక శా తం ఉద్యోగులు, వ్యాపారులు ఇక్కడే స్థిర నివాసా లు ఏర్పాటు చేసుకుంటున్నారు. వివిధ పనులపై ఇ చ్చోడకు వచ్చే వారి వాహనాలు, వినియోగదారులు దీనికి అదనం. వాణిజ్య సముదాయాలు, బ్యాంకు లు, వస్త్ర సముదాయాలు, హోల్ సేల్ కిరాణా దుకా ణాలు, రిటైల్ కిరాణా దుకాణాలు, జిన్నింగ్ ఫ్యాక్టరీలు, పదుల సంఖ్యలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఈ మార్గంలో నే నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వ్యాపారులు, కార్యాలయాలకు వెళ్లేవారు, కళాశాల, పాఠశాల విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతటి రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో వాహనాలను ఎక్కడ నిలపాలో తెలియక అడ్డదిడ్డంగా రహదారిపై పార్కింగ్ చేస్తున్నారు. దీంతో తరుచూ వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలగడమే కాకుండా నిత్యం వాహనాలదారుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

Related Posts