YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

రిలయన్స్ తో ఫైట్ కు అమెజాన్ రెడీ

రిలయన్స్ తో ఫైట్ కు అమెజాన్ రెడీ

రిలయన్స్ తో ఫైట్ కు అమెజాన్ రెడీ
న్యూ ఢిల్లీ  ఫిబ్రవరి 12
ఫ్యూచర్-రిలయన్స్ ఒప్పందం విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన రూలింగ్ పై ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సుప్రీంకోర్టును  ఆశ్రయించింది. దీంతో రిలయన్స్ తో ఫైట్ కు అమెజాన్ రెడీ అయినట్టు తెలుస్తోంది.ఫ్యూచర్ గ్రూపులో కీలకమైన ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్) లో ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు 7.3శాతం వాటాలున్నాయి. అమెజాన్ గత ఏడాది ఆగస్టులో ఈ ఫ్యూచర్ కూపన్స్ లో 49శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ డీల్ కుదిరినప్పుడే ఫ్యూచర్ గ్రూపును కూడా కొనేందుకు తమకు హక్కులు ఉన్నాయని అమెజాన్ చెబుతోంది.అయితే ఫ్యూచర్ గ్రూపు తమ రిటైల్ వ్యాపారాలను రిలయన్స్ కు విక్రయించింది. రూ.24713 కోట్ల ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్-రిలయన్స్ ఒప్పందాన్ని అమెజాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిపై సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ)ను అమెజాన్ ఆశ్రయించింది. దీనిపై స్టే ఇస్తూ ఫ్యూచర్ రిటైల్ ను ఆదేశించింది.అయితే ఈ నిర్ణయంపై జనవరి 26న ఫ్యూచర్ ముంబై హైకోర్టును ఆశ్రయించింది. దీనికి ప్రతిగా  అమెజాన్ జనవరి 25న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో ఫ్యూచర్ సీఈవో సహా వ్యవస్థాపకులందరినీ అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించింది.నాలుగురోజుల పాటు ఈ పిటిషన్ను  విచారించిన ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ 2021 పిబ్రవరి 2న రూలింగ్ ఇస్తూ ఆర్ఐఎల్తో ఒప్పందం విషయంలో యథాతథ స్థితిని పాటించాలని ఫ్యూచర్ గ్రూప్ను ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఫ్యూచర్ దాఖలు చేసిన అప్పీల్ను విచారించిన డివిజనల్ బెంచ్ ఈ నెల 8వ తేదీన ఫ్యూచర్కు అనుకూలంగా రూలింగ్ ఇచ్చింది. దీనిపై తాజాగా అమెజాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.

Related Posts