స్మార్ట్ ఫోన్ కు బానిసలుగా మారిన భారతీయులు
నోకియా తాజా నివేదిక వెల్లడి
న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 12
స్మార్ట్ ఫోన్ కు భారతీయులు ఎంతలా బానిసలుగా మారారో వెల్లడించే వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. స్మార్ట్ ఫోన్ తో గడిపే కాలం ప్రపంచ దేశాల్లోనే అత్యధికం మన దేశమే కావటం గమనార్హం. గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం నోకియా తాజా నివేదిక వెల్లడించింది. స్మార్ట్ ఫోన్ కు ఎంగేజ్ కావటం.. అదే పనిగా ఫోన్ ను చూసుకోవటంలోనే ఎక్కువగా గడిపేస్తున్నారట. అంతేకాదు.. స్మార్ట్ ఫోన్ తో అత్యధిక సమయం గడిపేది భారతీయులే అన్న కఠిన వాస్తవాన్ని తాజా రిపోర్టు స్పష్టం చేసింది. అందులోని విషయాల్ని చూస్తే.. స్మార్ట్ ఫోన్ కు.. అందులో వినియోగించే డేటాకు భారతీయులు ఎంతలా బానిసలు అయ్యారన్న వాస్తవం కళ్లకు కట్టినట్లుగా తాజా నివేదిక స్పష్టం చేస్తోంది.- మొబైల్ బ్రాండ్ బ్యాండ్ వినియోగంలో భారతదేశం రెండో స్థానంలో నిలిస్తే.. ఫిన్ లాండ్ మొదటి స్థానంలో ఉంది. స్మార్ట్ ఫోన్లో.. స్వల్ప నిడివి వీడియోల్ని చూసే సమయం 2025 నాటికి నాలుగు రెట్లు పెరిగే వీలుంది. గడిచిన ఐదేళ్లలో డేటా రద్దీ దాదాపు 60 రెట్లు పెరిగింది. ప్రపంచంలోనే ఇది అత్యధికం.- 2015 డిసెంబరులో 164 పెటాబైట్ల డేటా వినియోగిస్తే.. 2020 డిసెంబరు నాటికి 10వేల పెటాబైట్లకు పెరిగింది. 4జీ నెట్ వర్కుపై ఒక్కో యూజర్ నెలకు సరాసరిన 13.7 జీబీల డేటాను వినియోగిస్తున్నారు. గడిచిన ఏడాదిలో భారత సగటు వినియోగదారుడు స్మార్ట్ ఫోన్ తో వినియోగించే డేటా నాలుగు రెట్లు పెరిగింది.- సగటున రోజుకు 4.48 గంటల పాటు డేటా సేవల్ని వినియోగించుకుంటున్నాడు. ఈ వినియోగం ఇప్పుడున్న దానికి మరింత పెరిగే వీలుంది. డేటా వినియోగంలో 55 శాతం యూట్యూబ్ ది అయితే.. మిగిలింది సోషల్ మీడియా.. ఓటీటీ యాప్ ల్లోని బుల్లి వీడియోలదే. మిగిలిన 45 శాతం ఫిన్ టెక్ సేవల కోసం.. ఈ కామర్స్ ఇతర వెబ్ సైట్ల బ్రౌజింగ్ కోసం వినియోగిస్తున్నారు.- 2020 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఎడ్యుకేషన్ యాప్ లపై గడిపే సమయం 30 శాతానికి పెరగ్గా.. ఓటీటీ ట్రాఫిక్ 265 శాతం పెరిగింది.కరోనా దెబ్బకు ఇంటి నుంచి పని చేయటం.. ఆన్ లైన్ క్లాసుల కారణంగా దేశంలో ఫిక్సెడ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు భారీగా పెరిగాయి. రానున్న రోజుల్లో ఫైబర్ టు ది హోం.. ఫిక్సెడ్ వైర్ లెస్ సేవల డిమాండ్ అనూహ్యంగా పెరిగింది.