YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అధికారుల తీరుపై టీడీపీ అసంతృప్తి

అధికారుల తీరుపై టీడీపీ అసంతృప్తి

అధికారుల తీరుపై టీడీపీ అసంతృప్తి
విజయవాడ
తొలివిడత పంచాయతీ ఎన్నికల నిర్వహణతీరుపై,  ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు, రెవెన్యూఅధికారులు, ఎస్ఈసీ ఎన్నికల నిర్వహణలో వ్యవహరించినతీరుపై టీడీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోందని,  ఆపార్టీ జాతీయప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అసహనం వ్యక్తంచేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ సరైనరీతిలో ఎన్నికలు నిర్వహించలేదనే అభిప్రాయంతో తామున్నామని, ప్రభుత్వంలోనివారు, అధికారపార్టీకి చెందిన ముఖ్యనాయకులు, ముఖ్యమంత్రి సహా అందరూ ఎన్నికలకమిషనర్ ని కార్నర్ చేసి, ఆయన్ని కులపరంగా, వ్యక్తిత్వంపరంగా, దూషిస్తూ, మానసికంగా వేధిస్తున్నారని తాము ముందునుంచీ చెబుతూనే ఉన్నామన్నా రు. అధికారపార్టీ అరాచకానికి, మంత్రుల బెదిరింపులకు ఎన్నికల కమిషనర్ తలొగ్గినట్లుగా తాము అనిపిస్తోందన్న  రామయ్య, అందుకు తొలివిడత జరిగిన పంచాయతీఎన్నికలే నిదర్శనమన్నా రు.  బరితెగించి మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్ని కల కమిషనర్ ఏంచర్యలు తీసుకున్నారని, హైకోర్టు తీర్పుపై ఎస్ఈ సీ ఎందుకు అప్పీలు చేయలేదని, అలాచేయకపోవడంలో ఎస్ఈసీ మెతకతనం ఉన్నట్లుగా తమకు అర్థమైందని రామయ్య స్పష్టంచే శారు. ఎస్ఈసీకి సహకరించిన అధికారులను బ్లాక్ లిస్ట్ లో పెడతా నని మంత్రి బహిరంగంగా బెదిరిస్తే, అతనిపై ఐపీసీ 506 ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మంత్రి పెద్దిరెడ్డి, రాజ్యాంగవ్యవస్థపై దాడికి దిగితే, అతనిపై కేసులు పెట్టి చర్యలు తీసుకునేలా ఎస్ఈసీ ఎందుకు వ్యవహరించలేకపో యాడన్నారు. పెద్దిరెడ్డి హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెం చ్ కు వెళితే, దానిపై ఎస్ఈసీ ఎందుకు డివిజన్ బెంచ్ లో అప్పీలు చేయలేదని రామయ్య ప్రశ్నించారు.  అవినీతికి, అరాచకానికి మారుపేరైన, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పుంగనూరు నియోజకవర్గంలో 83పంచాయతీలకు తొలిదశలో ఎన్నికలు జరిగితే, 69స్థానాలు ఏకగ్రీవమైతే ఎస్ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు? అంతటి ఘనచరిత్ర పెద్దిరెడ్డికి ఉందని ఎస్ఈసీ భావి స్తున్నారా అని రామయ్య నిగ్గదీశారు. తొలుత ఏకగ్రీవాలను ప్రకటించవద్దన్న ఎస్ఈసీ, తరువాత ఏకపక్షంగా ఏకగ్రీవాలను ప్రకటిచండానికి ఎలా ఒప్పుకున్నారన్నారు. ఎస్ఈసీ గవర్నర్ ను కలిసి వచ్చినతర్వాతే ఏకగ్రీవాలను ప్రకటించాలని ఆదేశించడం జరిగిందన్నారు. మాచర్ల నియోజకవర్గంలో పోలీస్ యంత్రాంగం, అధికారులుఉన్నారా అనే సందేహం కలుగుతోందన్న రామయ్య,  అక్కడ 77స్థానాల్లో ఎన్నికలు జరిగితే, 76ఏకగ్రీవాలయ్యాయని, ఇండియాలో 29రాష్ట్రాల్లో ఎక్కడా ఈవిచిత్రం ఉండదన్నారు. ఇంత జరిగితే ఎన్నికలకమిషన్ ఏంచేస్తోందని రామయ్య ప్రశ్నించారు? 77స్థానాల్లో 76స్థానాలు  ఎలాఏకగ్రీవమయ్యాయనే విషయంపై విచారణకు ఆదేశించకుండా, అన్నిస్థానాలు ఏకగ్రీవమైనట్లు ఎస్ఈ సీ ఎలా ప్రకటిస్తుందన్నారు. గతంలోకూడా మాచర్లలో ఇప్పుడున్న ఎమ్మెల్యేనే అధికారంలోఉన్నాడని, ఆనాడుకానీ ఏకగ్రీవాలు ఇప్పు డెలా అయ్యాయనేదానిపై ఆలోచన చేయాల్సిన బాధ్యత ఎస్ఈసీ పై లేదా అని రామయ్య మండిపడ్డారు.  ఇవన్నీ చూశాకే ఎన్నికల కమిషన్  ప్రభుత్వానికి భయపడిందని తాము అంటున్నామన్నా రు. నాకు ఓటేయకపోతే, నాపార్టీ అభ్యర్థులను గెలిపించకపోతే, మీకు పథకాలురావని ఎమ్మెల్యే జోగిరమేశ్ అంటే, అతనికి తూతూ మంత్రంగా నోటీసులిచ్చిన ఎన్నికలకమిషన్ రేపట్నుంచీ ఇలా మాట్లాడొద్దని చెప్పడమేంటన్నారు.  పబ్లిక్ మీటింగ్ లో ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే తమకు ఓటేయకపోతే, ప్రభుత్వపరంగా వచ్చే రాయితీలు రావంటే, అతను వచ్చే ఎన్నికల్లో పోటీచేయకుం డా చర్యలు తీసుకోవాల్సిన ఎన్నికలకమిషన్, నోటీసులిచ్చి ఊరుకో వడమేంటని రామయ్య నిగ్గదీశారు. జోగిరమేశ్ వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను తాము ఎన్నికలకమిషనర్ కు ఇచ్చినా అతనిపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనుకాడారన్నారు. ఎస్ఈసీ ఈ విధంగా మెతకవైఖరిలో ఉంటే, అతన్ని ప్రభుత్వం లెక్కచేస్తుందా అన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు హత్యచేయడం కంటే తీవ్రమైనవని, అటువంటి పెద్దనేరానికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా, హెచ్చరించి వదిలేయడమేంటన్నారు? ఇప్పటికైనా ఎన్నికలకమిషన్ సత్వరమే స్పందించి, 6ఏళ్లవరకు ఏవిధమైన ఎన్నికల్లో పోటీచేయకుండా అతన్ని అనర్హుడిగా ప్రకటించాలని రామయ్య డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీరుచూసి, బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తమపార్టీ అభ్యర్థులకే ఓటు వేయాలని, తనపార్టీని గెలిపించకపోతే, తాను ఇక ఈ గ్రామానికి రానంటూ బహిరంగసభలో మాట్లాడాడని, అటువంటి వ్యక్తిపై ఎస్ఈసీ ఏంచర్యలు తీసుకుందన్నారు?  ఎన్నికలకమిషనర్ ఈ విధంగా వ్యవహరించేబదులు, అన్నిస్థానాల్లో వైసీపీ అభ్యర్థులే గెలిచినట్లు ప్రకటిస్తే సరిపోతుందన్నారు? పంచాయతీఎన్నికల్లో 90 స్థానాలు వైసీపీకేరావాలని ముఖ్యమంత్రి అన్నప్పుడే, ఆయనపై ఎస్ఈసీ చర్యలు తీసుకొనిఉంటే, నేడు ఆయనచూపిన బాటలో మంత్రులు, ఎమ్మెల్యేలు నడిచేవారు కాదని రామయ్య తేల్చిచెప్పా రు. ఎన్నికల కమిషనర్ అసమర్థతవల్ల ఎన్నికలకమిషన్ ఉనికికే ప్రమాదం వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. చిత్తూరు జిల్లా లో రొంపిచర్లలో ఇండిపెండెంట్ గా పోటీచేసిన వ్యక్తిని పట్టుకొని ఎస్ ఐ చితకబాది పొలాల్లో పడేయడమేంటన్నారు?  ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ మంత్రులుపెద్దిరెడ్డి, బాలినేని, ఎమ్మెల్యే జోగి రమేశ్, మాచర్ల ఎమ్మెల్యే, రొంపిచర్ల ఎస్ ఐలపై చర్యలు తీసుకో లేదో, అప్పుడే ఎస్ఈసీ వైఖరేమిటో తమకు అర్థమైందన్నారు. మాచర్లలో పోలీస్ వ్యవస్థ ఎమ్మెల్యే కనుసన్నల్లో పనిచేస్తోందని, డీఐజీ, ఎస్పీ చెప్పినా అక్కడున్న పోలీసులు పనిచేయడంలేదని తాము మొత్తుకున్నా, ఎస్ఈసీ ఎందుకు చర్యలుతీసుకోలేదన్నారు కొంతమంది పోలీస్అధికారులు వైసీపీ పార్టనర్లలా వ్యవహరిస్తున్నా రని, అటువంటివారంతా ఖాకీలు వదిలేసి, వైసీపీచొక్కాలు వేసుకోవాలని, అలాంటి అధికారులతీరుతో ఇప్పటికే డీజీపీ న్యాయస్థానాల్లో పలుమార్లు తలదించుకున్నాడన్నారు.  డీజీపీకి అసమర్థుడనే పేరుపడినా, ఆయన ఎందుకు తనతీరు మార్చుకోవ డంలేదో తమకు అర్థంకావడంలేదన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా వార్డు మెంబర్ గాపోటీచేసినా సరే, వారికి, వారికి ఓట్లువేసేవారికి అన్నిపథకాలు కట్ చేయమన్న జోగిరమేశ్ పై చర్యలు తీసుకోకపో వడం నిజంగా దారుణాతిదారుణమని రామయ్య వాపోయారు.  గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యంపై, రాజ్యాం గం పై నమ్మకముంటే, ఇటువంటి ఘటనలు జరగవన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం వైసీపీ ప్రభుత్వ ఇనుపపాదాల కింద అణచివేయబడుతోందన్నారు. చీఫ్ సెక్రటరీ మొదలు ఎంపీడీ వో వరకు అధికారయంత్రాంగం మొత్తం ప్రభుత్వానికి గులాంగిరీ చేస్తూ, రాజ్యాంగాన్ని అపహాస్యంచేస్తుంటే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోవడం ఏమిటన్నారు. ఎన్నికలకమిషనర్ తక్షణ మే స్పందించి మంత్రులు పెద్దిరెడ్డి, బాలినేని, ఎమ్మెల్యే జోగిరమేశ్, మాచర్ల ఎమ్మెల్యే, అక్కడి పోలీస్అధికారులపై చర్యలు తీసుకోవా లని రామయ్య పత్రికా సమావేశంలో డిమాండ్ చేశారు.

Related Posts