YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ దేశీయం

రాహుల్.. మీ ముత్తాత‌ను అడుగు : కిష‌న్ రెడ్డి

రాహుల్.. మీ ముత్తాత‌ను అడుగు : కిష‌న్ రెడ్డి

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి చుర‌క‌లంటించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ భార‌త భూగాన్ని చైనాకు అప్ప‌గించార‌న్న రాహుల్ వ్యాఖ్య‌ల‌పై కిష‌న్ రెడ్డి స్పందించారు. చైనాకు భార‌త భూభాగాన్ని ఎవ‌రు అప్ప‌గించార‌నేది మీ ముత్తాత‌ను‌(జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ)ను అడిగితే స‌మాధానం త‌ప్ప‌కుండా తెలుస్తుంద‌ని ఆయ‌న అన్నారు. దేశ‌భ‌క్తి ఎవ‌రికి ఉందో.. ఎవ‌రికి లేదో ప్ర‌జ‌ల‌కు తెలుసు అని కిష‌న్ రెడ్డి పేర్కొన్నారు.భారత్‌-చైనా మధ్య గతంలో కుదిరిన సరిహద్దు ఒప్పందం ప్రకారం.. పాంగాంగ్‌ సరస్సుకు ఉత్తరంగా ఫింగర్‌ 8 ప్రాంతం వరకు మాత్రమే చైనా బలగాలు ప్రవేశించడానికి అనుమతి ఉన్నది. అలాగే ఫింగర్‌ 3 ప్రాంతం వరకు మాత్రమే భారత బలగాలు వెళ్లాలి. వీటి మధ్య ఉన్న ఫింగర్‌ 4, 5, 6, 7 ప్రాంతాల్లోకి ఇరు దేశాల బలగాలు ప్రవేశించకూడదు. అయితే, ఆ ప్రాంతంలో గస్తీ మాత్రం నిర్వహించుకోవచ్చు. దీంతో   చైనా బలగాలు ఫింగర్‌ 4 ప్రాంతం నుంచి ఫింగర్‌ 8 ప్రాంతానికి వెనక్కివెళ్లాలి. అలాగే భారత జవాన్లు కూడా ఫింగర్‌ 4 ప్రాంతం నుంచి ఫింగర్‌ 3 ప్రాంతానికి సమీపంలోని ధాన్‌ సింగ్‌ థపా సైనిక పోస్టుకు చేరుకోవాలి.  ఇరుదేశాలకు చెందిన  యుద్ధ ట్యాంకుల ఉపసంహరణ ప్రారంభమైనట్టు గురువారం పలు మీడియా చానళ్లు వార్తలు ప్రసారం చేశాయి. ఫింగర్‌ 4 నుంచి ఇరు దేశాల బలగాలు పూర్తిగా ఉపసంహరించేంతవరకూ ఫింగర్‌ 3, ఫింగర్‌ 8 మధ్య ప్రాంతంలో గస్తీ ఉండకపోవచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.భారత్‌-చైనా మధ్య గతంలో కుదిరిన సరిహద్దు ఒప్పందం ప్రకారం.. పాంగాంగ్‌ సరస్సుకు ఉత్తరంగా ఫింగర్‌ 8 ప్రాంతం వరకు మాత్రమే చైనా బలగాలు ప్రవేశించడానికి అనుమతి ఉన్నది. అలాగే ఫింగర్‌ 3 ప్రాంతం వరకు మాత్రమే భారత బలగాలు వెళ్లాలి. వీటి మధ్య ఉన్న ఫింగర్‌ 4, 5, 6, 7 ప్రాంతాల్లోకి ఇరు దేశాల బలగాలు ప్రవేశించకూడదు. అయితే, ఆ ప్రాంతంలో గస్తీ మాత్రం నిర్వహించుకోవచ్చు. దీంతో   చైనా బలగాలు ఫింగర్‌ 4 ప్రాంతం నుంచి ఫింగర్‌ 8 ప్రాంతానికి వెనక్కివెళ్లాలి. అలాగే భారత జవాన్లు కూడా ఫింగర్‌ 4 ప్రాంతం నుంచి ఫింగర్‌ 3 ప్రాంతానికి సమీపంలోని ధాన్‌ సింగ్‌ థపా సైనిక పోస్టుకు చేరుకోవాలి.  ఇరుదేశాలకు చెందిన  యుద్ధ ట్యాంకుల ఉపసంహరణ ప్రారంభమైనట్టు గురువారం పలు మీడియా చానళ్లు వార్తలు ప్రసారం చేశాయి. ఫింగర్‌ 4 నుంచి ఇరు దేశాల బలగాలు పూర్తిగా ఉపసంహరించేంతవరకూ ఫింగర్‌ 3, ఫింగర్‌ 8 మధ్య ప్రాంతంలో గస్తీ ఉండకపోవచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.

Related Posts