YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

వాతావరణ మార్పులు.. హిమానీనద సరస్సులపై ప్రబావం

వాతావరణ మార్పులు.. హిమానీనద సరస్సులపై ప్రబావం

వాతావరణ మార్పుల కారణంగా లాహాల్ స్పితి రీజియన్‌లోని చంద్ర లోయలో 65 హిమానీనదాలు రాబోయే సంవత్సరాల్లో సుమారు 360 చిన్న, పెద్ద హిమానీనద సరస్సులపై మొత్తం పరిమాణం 49.56 చదరపు కిలోమీటర్లు నిర్మించబడతాయని, వీటి వల్ల వినాశనం సంభవించవచ్చు. అందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కేదార్‌నాథ్ గాయాలను మరిచిపోకముందే ఉత్తరాఖండ్‌లోని చమోలిలో హిమానీనదం విపత్తు సృష్టించింది. ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోని పక్షంలో ఉత్తరాఖండ్‌ మాదిరి వినాశనం హిమాచల్ ప్రదేశ్‌లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.సిసు పట్టణం మనాలి నుంచి 40 కి.మీ దూరంలో ఉంటుంది. ఈ పట్టణానికి పైన ఉన్న పర్వతాలలో ఒక సరస్సు ఉండి.. దాని చుట్టూ హిమానీనదం పేరుకుపోయి ఉన్నది. ఈ హిమానీనదం నిరంతరం కరగడం వల్ల భవిష్యత్‌లో సరస్సులో నీరు పెరుగుతుంది. భవిష్యత్‌లో సరస్సు విస్ఫోటనం చెందితే నీరు వేగంగా కిందికి ప్రవహిస్తుంది.హిమాలయ ప్రాంతంలో తయారవుతున్న సరస్సులను నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నది. కేదార్‌నాథ్‌లో 2013లో జరిగిన సంఘటన నుంచి పాఠాలు నేర్చుకోవాలి. భవిష్యత్‌లో సరస్సు పేలుళ్లు వంటి సంఘటనలను తగ్గించడానికి విధానాలను రూపొందించడానికి ఐఐటీ బొంబాయి వంటి సంస్థలు చేసిన పరిశోధనల నివేదికల సమాచారం సహాయపడుతుంది. ఇది విధాన రూపకర్తలు, విపత్తు నిర్వహణ అధికారులు, స్థానిక పరిపాలనా అధికారులకు సహాయపడుతుంది. సరస్సులను పర్యవేక్షించడానికి ఉపగ్రహ చిత్రాలను విస్తృతంగా ఉపయోగించాలి. ఉపగ్రహ ఫొటోలను అందించడంలో ఇస్రో, ఇతర విదేశీ సంస్థలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.భవిష్యత్‌లో ఈ సరస్సుల నిల్వ పరిమాణం సుమారు 1.08 క్యూబిక్ కిలోమీటర్లుగా ఉంటుందని డాక్టర్ అంకుర్ పండిత్‌ చెప్తున్నారు. వీటిలో అతిపెద్దది 2.06 చదరపు కిలోమీటర్ల పరిమాణాన్ని కలిగి ఉన్న గపాంగ్ గాత్ హిమానీనదం మీద నిర్మించబడుతుందని తెలిపారు. ప్రస్తుతం గపాంగ్ గాత్ హిమానీనదంలో ఉన్న సరస్సు 0.8 చదరపు కి.మీ. గపాంగ్ గాత్ హిమానీనదంపై భవిష్యత్ సరస్సు చాలా పెద్దది, నిరంతర వాతావరణ మార్పుల కారణంగా ఈ సరస్సు విస్ఫోటనం చెందుతున్నప్పుడు సిసు పట్టణం వరదలతో ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయి. జలవిద్యుత్ ప్రాజెక్టుల ప్రణాళికకు సంబంధించి చమోలి సంఘటన నుంచి రాష్ట్రం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని, హైడెల్ ప్రాజెక్టులకు స్థలాలను గుర్తించాలని హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ అన్నారు.

Related Posts