YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రేషన్ బియ్యంలో మట్టి, చెత్తా, చెదారం

రేషన్ బియ్యంలో మట్టి, చెత్తా, చెదారం

హైదరాబాద్ మహానగరంలో చౌకధరల దుకాణాలద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న సబ్సిడీ బియ్యం నాణ్యత లోపిస్తోంది బియ్యంలో మట్టి, చెత్తా, చెదారం కలిసిపోతుంది. గోదాముల్లో పనిచేసే సిబ్బంది సైతం సంచులకు రంధ్రాలు చేసి బియ్యాన్ని తస్కరిస్తున్నారు. దీంతో రవాణా నిల్వ చేసినప్పుడు మట్టి పెళ్లలు చెత్తా, చెదారం కలుస్తున్నాయి. ఈ విషయమై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పౌరసరఫరాలశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విధంగా ఇసుక, మట్టి, చెత్తా చెదారం కలిసి బియ్యాన్ని స్టేజ్ 2 కాంట్రాక్టర్లు ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి చౌకధరల దుకాణాలకు చేరుస్తున్నారు.ఆ బియ్యాన్ని డీలర్లు కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. బియ్యంలో ఇసుక, మట్టి పెళ్లలు, పురుగులు ఉన్నాయని కార్డుదారులు డీలర్లను అడిగితే గోదాముల నుంచి అలాగే వస్తున్నాయి. తీసుకుంటే తీసుకోండి లేకపోతే వెళ్లడంటూ డీలర్లు దురుసుగా సమాధానమిస్తున్నారు.. ప్రభుత్వం సరఫరా చేస్తున్న రూపాయికి కిలో బియ్యంలో ఇసుక, మట్టి, పురుగులు దర్శనమిస్తున్నాయి. దీంతో చౌక బియ్యం కొనడానికి పేదలు వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 15.38 లక్షల ఆహారభద్రత కార్డులున్నాయి. ప్రతి నెలా ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కిలోల చొప్పున ఇంట్లో ఐదుగురు ఉంటే 30 కిలోల చొప్పున బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా బియ్యం నాసిరకంగా ఉంటున్నాయని, బియ్యంలో చెత్తా, చెదారం, ఇసుక రాళ్లతో పాటు పురుగులు దర్శనమిస్తున్నాయని వినయోగదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థలో బియ్యం బస్తాలు నేరుగా భారత ఆహార సంస్ధ గోదాం నుంచి మండల నిల్వ కేంద్రాలకు వస్తాయి. అయితే అక్కడ బియ్యాన్ని భూమి మీదే నిల్వ చేస్తున్నారు. మూడు నెలల పాటు సరుకులు తీసుకోకపోతే కార్డులను రద్దు చేస్తామని పౌరసరఫరాలశాఖ హెచ్చరిస్తున్నా కార్డుదారులు మా త్రం నాసిరకం బియ్యం తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఈ విషయమై పౌరసరఫరాలశాఖ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లితే తాము నాణ్యతమైన బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. కాని క్షేత్రస్థాయిలో మాత్రం బియ్యం నాసిరకంగా, మట్టి, ఇసుక, పురుగులు కలిసి ఉంటున్నాయని కార్డుదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులు స్పందించి చౌకధరల దుకాణాల ద్వారా నాణ్యతమైన, మట్టి, ఇసుక, పురుగులు కలువని బియ్యాన్ని సరఫరా చేయాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Posts