YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

పార్ట్-బి, పోడు భూముల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జీ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి

పార్ట్-బి, పోడు భూముల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జీ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి

పార్ట్-బి, పోడు భూముల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జీ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో  కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం పార్ట్ బి మరియు పోడు భూముల సమస్యలను పరిష్కరించకుండా రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తోంది.అని అన్నారు.గత ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన పట్టాలను ఈ ప్రభుత్వం పూర్తి విస్మరించిందని ఎద్దేవాచేశారు.ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చిన్న సాకులు చూపుతూ చాలా మంది రైతుల భూములను పార్ట్ బి లో పెట్టి పాసుపుస్తకాలు ఇవ్వకుండా జాప్యం చేస్తూ రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. అదే విధంగా ముఖ్యంగా గిరిజన ప్రాంతంలోని కొన్ని దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల భూములను లాక్కోవడం దారుణం అన్నారు.పార్ట్ బి  లో ఉన్న రైతుల, మరియు పోడు భూముల రైతులకు పాసుపుస్తకాలు అందకపోవడం వలన, రైతు బంధు, రైతు బీమా, పంట రుణాలు అందక రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారు కావున ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం రైతు సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.. కావున నియోజకవర్గంలోని ఈ సమస్యలతో సతమతమవుతున్న రైతులందరికోసం  ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. కావున బాధిత రైతులు తమ పూర్తి వివరాలును కార్యాలయంలో అందజేయగలరు. వారం రోజులలోగా అందజేసినచో మీ భూముల సమస్యల పరిష్కరం కోసం రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అధికారుల దృష్టి కి తీసుకెళ్లి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చి మీ సమస్యలను పరిష్కరిస్తాము అని తెలపడం జరిగింది.. ఇతర వివరాలకు జనార్ధన్ రెడ్డి 9440936946,హఫీజ్ 9490415510 కి సంప్రదించగలరు ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు హఫీజ్, వైస్ ఎంపీపీ నర్సింలూ, మాజీ జడ్పీటీసీ గాయజోద్దీన్, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, బాలరాజు గౌడ్, పరందములు, చిరంజీవులు, గోవింద్, యూనిస్, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts