ఎండ.. వేడి.. ఈ ఎండ వేడి వల్ల శరీరంలో ఉండవలసిన నీటి శాతం ఒక్కోసారి పడిపోతుంది. శరీరంలో ఉండవలసిన నీటి పరిమాణంలో 5 శాతం అంతకన్నా ఎక్కువగా నీరు తగ్గితే దానిని డీహైడ్రేషన్‌గా పరిగణిస్తారు.శరీరం నుంచి బయటకు పోయిన నీటిని తిరిగి భర్తీ చేస్తే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చు. పిల్లలకు అవసరం లేదన్నా కొద్ది కొద్దిగానైనా నీరు తాగిస్తూ ఉండాలి. శరీరంలో ఎప్పుడూ ద్రవాలు సమతుల్యంలో ఉండేలా ఎప్పుడూ నీరు తాగుతూ ఉండాలి. లేత కొబ్బరి నీరు ఉపయోగకరంగా పనిచేస్తుంది. ఐస్ ముక్కలు చప్పరించడం లేదా ఒంటినిండా రాస్తే శరీరం చల్లబడుతుంది. ఎండుద్రాక్ష, ఎండు ఖర్జూరం ఉదయం నీటిలో నానబెట్టి ఎండవేళ ఇవ్వాలి. ఇవి చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో మరింత ఉపయోగకరంగా ఉంటాయి. ఎండలో ప్రయాణించేటపుడు చల్లటి నీరు, గ్లూకోజ్‌ను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. మజ్జిగ, పెరుగు, ఆపిల్, దానిమ్మ, బొప్పాయి, అరటి, క్యారెట్, బార్లీ నీళ్లు, చల్లటి గంజి, నిమ్మరసం, తాజా పళ్లను తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవచ్చు.నాలుక పిడచకట్టుక పోవడం కనిపిస్తుంది. కళ్లు తిరగడం, వికారం ఉంటుంది. చర్మం ఎర్రగా పొడిబారిపోతుంది. విపరీతమైన నీరసం ఆవహిస్తుంది. మూత్రవిసర్జన తగ్గడం, చిక్కబడటం, పసుపుగా అవడం వంటి లక్షణాలు కనబడతాయి. శరీర ఉష్ణోగ్రత అతి ఎక్కువగా లేదా చల్లగా ఉంటుంది. తొందరగా చికాకు పడటం వంటి లక్షణం కనిపిస్తుంది. ఆకలి మందగించడం, పల్స్ రేటు తగ్గిపోవడం జరుగుతుంది. ఈ క్రమంలో డీహైడ్రేషన్ వల్ల కనిపించే ఈ లక్షణాలను పట్టించుకోకపోతే అది ప్రమాదకరంగా మారిపోయి వ్యక్తులు సొమ్మసిల్లి కోమాలోకి పోవడం కూడా జరుగుతుంది.