నడకతో మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని, అనారోగ్యానికి దూరం కావొచ్చని అల్లూరి సీతారామరాజు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు రమాదేవి అన్నారు .శనివారం స్థానిక ఇరుగాచళమ్మ గుడి వద్ద జరిగిన అల్లూరి సీతారామారాజు వాకర్స్ అసోసియేషన్ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రజల్లో ఊబకాయం, షుగర్, బీపీ ,థైరాయిడ్ లాంటి సమస్యలు పెరుగుతున్నాయన్నారు. .ఆరోగ్యం బాగుండాలంటే ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు నడవాలని ఆమె సూచించారు .
ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ గవర్నర్ రాఘవరెడ్డి ,ప్రధాన కార్యదర్శి బలరాం నాయుడు, కోశాధికారి సత్యనారాయణ, మాజీ గవర్నర్ రాఘవేంద్ర శెట్టి , గౌతమబుద్ధుడు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జయప్రకాశ్, ప్రధానకార్యదర్శి రాయప్ప, కోశాధికారి రామ్మోహన్ , అల్లూరి సీతారామరాజు వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మినారాయణ , కోశాధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు .ఈ సందర్బంగాల రమాదేవి అతిథులను ఘనంగా సన్మానించారు.