YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జడ్జి పుష్పకు షాక్

జడ్జి పుష్పకు షాక్

జడ్జి పుష్పకు షాక్
ముంబై, ఫిబ్రవరి 13,
పోస్కో కేసులో వివాదాస్పద తీర్పులతో
బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తి జస్టిస్ పుష్పా గనేడీవాలా ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా, ఆమెను మరో ఏడాది పాటు అదనపు న్యాయమూర్తిగా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, జస్టిస్ పుష్పా గనేడీవాలాను రెండేళ్లు అదనపు జడ్జిగా నియామకానికి సుప్రీంకోర్టు కొలీజయం సిఫార్సు చేయడం గమనార్హం. అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ పుష్పా గనేడీవాలా పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం ఆదేశాలు ఫిబ్రవరి 13 నుంచి అమల్లోకి వచ్చాయి.గత నెలలో రెండు వివాదాస్పద తీర్పులు ఇచ్చిన తర్వాత జస్టిస్ పుష్పా గనేడీవాలాను శాశ్వత న్యాయమూర్తిగా నియామకానికి చేసిన ప్రతిపాదనలను సుప్రీంకోర్టు కొలిజయం వెనక్కు తీసుకుంది. అనంతరం ఆమెను మరో రెండేళ్ల పాటు అదనపు న్యాయమూర్తిగా కొనసాగించాలని ప్రతిపాదించింది. కానీ, శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మాత్రం ఏడాదిపాటు అదనపు న్యాయమూర్తిగా కొనసాగిస్తున్నట్టు పేర్కొంది.రెండేళ్ల కాలపరిమితికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుకు బదులు కేవలం ఏడాది మాత్రమే పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సాధారణంగా శాశ్వత న్యాయమూర్తులుగా నియామకానికి ముందు రెండేళ్లు అడిషనల్ జడ్జిగా నియమిస్తారు. దుస్తులపై నుంచి బాలిక ఛాతి భాగాన్ని తడిమితే అది లైంగిక వేధింపుల కిందకు రాదంటూ జనవరి 24న నాగ్‌పూర్ బెంచ్ అదనపు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ పుష్పా తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై సర్వత్రా విస్మయం వ్యక్తం కాగా.. సుప్రీంకోర్టు దీనిని నిలుపుదల చేసింది.మరో రెండు రోజుల తర్వాత ఓ ఐదేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులోనూ ఆమె ఇదే తరహా తీర్పునే వెలువరించారు. బాలికల చేతులను పట్టుకోవడం, వారి ముందు ప్యాటు జిప్పు విప్పడం లైంగిక వేధింపుల కిందికి రావని ఆమె తీర్పు ఇచ్చారు. ఈ తీర్పులకు ముందే జనవరి 20న జరిగిన సమావేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే సారథ్యంలోని కొలీజియం.. జస్టిస్‌ పుష్పను బాంబే హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమించేందుకు ఆమోదం తెలిపింది. అయితే ఆమె ఇచ్చిన రెండు వివాదాస్పద తీర్పులతో ఈ నిర్ణయాన్ని కొలీజియం వెనక్కి తీసుకుంది.

Related Posts