YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

మేయర్ అనుచరుడికి లక్ష ఫైన్

మేయర్ అనుచరుడికి లక్ష ఫైన్

మేయర్ అనుచరుడికి లక్ష ఫైన్
హైదరాబాద్, ఫిబ్రవరి 13, 
గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్ గద్వాల విజయలక్ష్మి తాజాగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఈలోపే ఆమె అనుచరుడికి జీహెచ్‌ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఈ నెల 11న గ్రేటర్ మేయర్‌గా విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా శ్రీలత ఎన్నికయ్యారు. అయితే మేయర్ విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె అనుచరుడు అతిష్ అగర్వాల్.. నగరంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై నగర పౌరుడు ట్విట్టర్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులను ప్రశ్నించాడు.దీంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు అతీష్ అగర్వాల్‌.. ఫ్లెక్సీలు అనధికారికంగా ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సదరు విజయలక్ష్మి అనుచరుడు అతిష్ అగర్వాల్‌పై అధికారులు కొరడా ఝళిపించింది. అతిష్ అగర్వాల్‌కు లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ జీహెచ్ఎంసీ ఈవీడీఎం అధికారులు షాకిచ్చారు. దీంతో అతిష్ ఇప్పుడు లక్ష రూపాయల ఫైన్ కాస్త కాట్టాల్సి వస్తోంది. మేయర్ అనుచరుడికి ఇలా భారీ జరిమానా విధించడంతో ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది.

Related Posts