YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఆన్ లైన్ విపణి లో పతంజలి ఉత్పతులు..

ఆన్ లైన్ విపణి లో పతంజలి ఉత్పతులు..

బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్ స్వదేశీ శ్రేణికి చెందిన ఎఫ్.ఎం.సి.జి. ఉత్పత్తుల ఆన్‌లైన్ అమ్మకాలు పెంచుకోవడంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఎనిమిది ప్రసిద్ధ రిటైలర్లు, అగ్రిగేటర్లతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశం ఉందని కంపెనీ అధికారి ఒకరు చెప్పారు. ప్రధాన ఆన్‌‌లైన్ రిటైలర్లు (అవెుజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్, 1ఎం.జి., బిగ్‌బాస్కెట్, గ్రాఫెర్స్, షాప్‌క్లూస్, స్నాప్‌ డీల్)తో హరిద్వార్ కేంద్రంగా ఉన్న ఈ కంపెనీ ఈ నెలలో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. దాంతో సదరు ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలపై త్వరలోనే పంతజలి ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. పతంజలి సంస్థ జనవరి 16న దిల్లీలో ఒక కార్యక్రమం నిర్వహించనుంది. బాబా రాందేవ్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణతో పాటు అన్ని ఆన్‌లైన్ కంపెనల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. ‘‘దీంతో మారుమూల ప్రాంతాల కస్టవుర్లకు కూడా మా ఉత్పత్తులు చేరతాయి’’ అని పతంజలి అధికార ప్రతినిధి ఎస్.కె. టిజరవాలా చెప్పారు.

పతంజలి సంస్థకు పతంజలి ఆయుర్వేద్ డాట్ నెట్ పేరుతో సొంత పోర్టల్ ఉంది. దాని ద్వారా అది ఆన్‌లైన్ అమ్మకాలు సాగిస్తోంది. కానీ, మరికొందరు రిటైలర్లతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం వల్ల  ఉత్పత్తులు మరింత మంది వినియోగదారులకు చేరువకానున్నాయి. వివిధ ఇతర విక్రేతల ద్వారా పతంజలి ఉత్పత్తులలో కొన్ని ఇప్పటికే వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలపై అందుబాటులో ఉన్నాయి. పతంజలి సంస్థ ఇటీవల పిల్లలు, పెద్దల డయాపర్లు, ఓ మోస్తరు ధరకు లభించే శానిటరీ న్యాప్‌కిన్‌ల విభాగాలలోకి కూడా ప్రవేశించింది. సౌర విద్యుత్తుతో పనిచేసే వస్తువుల ఉత్పత్తిలోకి అడుగుపెడుతున్నట్లు అది గత నెలలో ప్రకటించింది. వేగంగా అమ్ముడుపోయే వినియోగ వస్తువుల రంగంతోపాటు విద్య, ఆరోగ్య రక్షణ రంగాలలో కూడా కార్యకలాపాలు సాగిస్తున్న పతంజలి సంస్థ టర్నోవరు 2016-17లో రూ. 10,500 కోట్లు దాటింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దానికి రెండింతల వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

Related Posts