ఆదోని
మండల పరిధిలో పెద్ద తుంబలం గ్రామంలో శనివారం విద్యుత్ సర్క్యూట్ వల్ల 2 కొట్టాలు దగ్ధం కావడం జరిగింది. సుమారుగా రెండు కొట్టాల లో ఉన్న నిత్యవసర సరుకులు నగదు మొత్తం ఎనిమిది లక్షలు నష్టం కలిగిందని బాధితులు హనుమంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా 50 వేలు డబ్బులు 20 సంచీల మిరప , నాలుగు కింటల్ పత్తి ,23 ప్యాకెట్స్ బియ్యం ,16 ఎరువు సంచీలు షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమయ్యాయి అన్నారు.
అదేవిధంగా పక్కన ఉన్న గుడిసె లో బియ్యం ,బట్టలు సరుకులు దగ్ధం కావడం జరిగిందని బాధితుడు తాయప్ప తెలిపాడు. తక్షణమే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేయడంతో తో కొంత ఉపశమనం కలిగిందన్నారు .ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం చెల్లించి బాధితులకు న్యాయం చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు కోరారు.