YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తిరుపతి బై పోల్ ఖర్చు 300 కోట్లు

తిరుపతి బై పోల్ ఖర్చు 300 కోట్లు

తిరుపతి, ఫిబ్రవరి 15, 
ఎన్ని సార్లూ ఓటు ఐదొంద‌ల‌కే దొర‌క‌దు. ఒక్కోసారి వెయ్యి పెట్టాలి. ఐదువేలు పెట్టాలి. స‌ర‌దా తీరిపోయే కొన్ని సెంటర్లుంట‌య్.. వంద‌ల కోట్లు ఖ‌ర్చైనా.. వెన‌క్కి త‌గ్గ‌లేం. ఇలాంటి డైలాగే.. బిజినెస్ మేన్ మూవీలో ఉంటుంది. అదే సినిమాలో క‌డ‌ప‌లోనే 200 కోట్లు ఖ‌ర్చు అయ్యాయి అనే డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ఇంకో అద్దురూపాయి వేసుకుందాం. అంటే.. 300 కోట్లు ఖ‌ర్చు తప్ప‌దు. అచ్చం అలాంటి సీనే తిరుప‌తిలో క‌నిపించ‌బోతుంది.ఎస్.. ఎన్నిక‌ల టైం ద‌గ్గ‌రికి వ‌స్తోంది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ఏ క్ష‌ణాన్నైనా రావ‌చ్చు. వ‌చ్చే నెల‌లో ఎన్నిక‌లు ఉండొచ్చు అంటున్నారు. షెడ్యూల్ నోటిఫికేష‌న్ల వంటివి.. ఈనెల ఎండింగ్ లోకానీ.. వ‌చ్చే నెల స్టార్టింగ్ లో కానీ ఉండొచ్చు. అందుకే.. పార్టీల‌న్నీ.. బానే పోటీ ప‌డుతున్నాయి. ఎక్కడా త‌గ్గ‌డం లేదు. అయితే.. ఇక్క‌డ ఎవ‌రు పోటీ చేస్తున్నారు అనే విష‌యాల్లో ఒక్క టీడీపీకి త‌ప్ప‌.. మ‌రే పార్టీకీ క్లారిటీ లేదు. టీడీపీ అయితే.. ప‌న‌బాక ల‌క్ష్మిని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించేసింది.ఇక వైసీపీ మాత్రం గురు మూర్తి విష‌యంలో ఇంకా క్లారిటీకి రావ‌డం లేద‌ట‌. గురుమూర్తికి కాస్త పేరున్నా.. జ‌గ‌న్ ఫ్యామిలీతో మంచి ఫ్రెండ్షిప్ ఉన్నా.. అంత పెద్ద క్యాష్ పార్టీ కాదు అనే టాక్ ఉంది. సో.. ఆయ‌న అంత ఖ‌ర్చు పెట్ట‌లేక పోవ‌చ్చు అని ఆలోచిస్తున్నార‌ట‌. అభ్య‌ర్థిని మార్చాలా అనే థాట్ లో కూడా ఉన్నార‌ట‌. పోనీ.. డ‌బ్బున్న వాళ్లు ఖ‌ర్చు పెడ‌తారులే అనుకుంటే..ఆ నియోజ‌క వ‌ర్గంలో.. సీటు ఎక్స్ పెక్ట్ చేసి.. వెన‌క్కి త‌గ్గిన వాళ్లే ఉన్నార‌ట‌. సో.. వారిని ఖ‌ర్చు పెట్ట‌మ‌న‌డం క‌రెక్ట్ గా ఉండ‌దు అని.. వైసీపీ సీనియ‌ర్లు లెక్క‌లు వేస్తున్నార‌ట‌. అందుకే.. త్వ‌ర‌లోనే నియోజ‌క వ‌ర్గాల్లోని ఎమ్మెల్యేల‌తో మీటింగ్ పెట్టి.. త‌లా ప‌ది ప‌దిహేను కోట్లు ఖ‌ర్చు పెట్టి.. దాదాపు వంద కోట్ల దాకా ఖ‌ర్చుకి ప్రిపేర్ కావాలి అని చెప్ప‌బోతున్నారు అనే టాక్ న‌డుస్తోంది. అలా అయితే.. ఏడు నియోజ‌క వ‌ర్గాల్లో ఏడుగురు ఎమ్మెల్యే ప‌ది హేను కోట్ల లెక్క‌న ఖ‌ర్చు పెడితే.. వంద కోట్లు అవుతుంది. ఎమ్మెల్యేలు ప‌ద‌వుల్లో ఉంటారు కాబ‌ట్టి.. ఇంకో మూడేళ్లు ప‌ద‌వి ఉంటుంది కాబ‌ట్టి.. ధైర్యంగానే పెడ‌తారు అనే లెక్క‌ల్లో ఉన్నార‌ట‌. మ‌రి కాన్ఫిడెన్స్ ఉన్న వైసీపీనే వంద కోట్లు ఖ‌ర్చు పెడితే.. ప్ర‌తిప‌క్షంలో ఉండి.. గెలిచి తీరాలి అని ప‌ట్టుమీదున్న మూన్నాలుగు పార్టీలు ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టాలి. ఇండిపెండెంట్లు ఇంకెంత పెట్టాలి. ఇవ‌న్నీ చూస్తుంటే.. తిరుప‌తి ఎంపీ ఎన్నిక‌ల ఖ‌ర్చు.. 3 వంద‌ల కోట్ల ఖ‌ర్చుకంటే పైనే ఉండొచ్చు అని లెక్క‌లేస్తున్నారు నిపుణులు.

Related Posts