YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖ,అమరావతి ఉద్యమం

విశాఖ,అమరావతి ఉద్యమం

విజయవాడ, ఫిబ్రవరి 15, 
ఐక్య‌మ‌త్య‌మే మ‌హాబ‌లం అంటారు క‌దా. ఏపీలో రైతులు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. త‌మ లాంటి క‌ష్ట‌మే వేరే వారికి రావ‌డంతో.. ఇమీడియ‌ట్ గా రెస్పాండ్ అవుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం క‌దా. ఇప్పుడు అదే హాట్ టాపిక్ అవుతోంది ఏపీలో. పొలిటిక‌ల్ లైన్ మొత్తం అటు సైడ్ తిరిగింది. రైతులు కూడా వారికి మ‌ద్ద‌తివ్వ‌డానికి రెడీ అవుతున్నారు. ఇన్నాళ్లూ అమ‌రావ‌తి ఉద్య‌మం ఒక్క‌టే చేసిన రైతులు.. ప్ర‌భుత్వాలు చేస్తున్న అరాచ‌కాల‌పై అడ్డం తిర‌గాలి అని డిసైడ్ అయ్యారు. అన్న‌దాత అడ్డం తిరిగితే ఎలా ఉంటుందో చూపిస్తాం అంటున్నారు. ఆల్రెడీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్య‌మం ఊపందుకుంది. టీడీపీతో పాటు.. మిగ‌తా పార్టీలు కూడా మ‌ద్ద‌తిస్తున్నాయి. లీడ‌ర్లు స్వ‌చ్చందంగా ముందుకు వ‌స్తున్నారు. పార్టీల‌తో సంబంధం లేకుండా కూడా న‌డుస్తున్నారు. ఇక వారికి రైతులు కూడా తోడు కాబోతున్నారు. అమ‌రావ‌తి నుంచి.. రేపు మూడు బ‌స్సుల్లో రైతులు వెళ్లి విశాఖ ఉద్య‌మానికి మ‌ద్ద‌తిస్తాం అంటూ.. ఓ లేఖ విడుద‌ల చేశారు. ఆ త‌ర్వాత‌.. కంటిన్యూ చేసే అవ‌కాశాలు కూడా లేక‌పోలేదు.
ఏపీపై కేంద్ర ప్ర‌భుత్వం ఎంత క‌క్ష క‌ట్టిందో అంద‌రూ చూస్తూనే ఉన్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న వైసీపీ స‌ర్కార్ కూడా.. కేంద్రం తానా అంటే.. ఇక్క‌డ తందానా అన‌డంపై జ‌నం సీరియ‌స్ గా ఉన్నారు. రైతులు మ‌రి కాస్త సీరియ‌స్ గా ఉన్నారు. మేమున్నాం అంటున్న వైసీపీ స‌ర్కార్.. ఒక‌రిద్ద‌రు లీడ‌ర్లు ఎంపీలు ఎమ్మెల్యేలు బ‌య‌టికొచ్చి.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి మద్దతు ఇస్తున్న‌ట్లు క‌నిపిస్తున్నారే త‌ప్ప‌.. అంత మంది ఎంపీలు ఉండి.. అంత మంది ఎమ్మెల్యేలు ఉండి బ‌లంగా బ‌య‌టికొస్తే.. మ‌న‌స్పూర్తిగా బ‌య‌టికొస్తే.. ఈ పాటికే ఉద్య‌మం మ‌రోలా ఉండేది. అయినా స‌రే.. వైసీపీ మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు ఉండ‌డంతో.. జ‌నం ర‌క‌ర‌కాలుగా మాట్లాడుకుంటున్నారు. ప్ర‌తి పక్షాలు క‌మెంట్ చేస్తున్న‌ట్లు.. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మ‌కంలో.. వైసీపీకి కూడా వాటా ఉన్న మాట నిజ‌మేనేమో అనే లెక్క‌ల్లో ఉన్నారు. ఆల్రెడీ ఆ మాట‌పై అంద‌రికీ న‌మ్మ‌కం వ‌చ్చింది. ఇక వైసీపీ ఇలాగే చేస్తే మాత్రం.. మ‌రికాస్త క్లారిటీస్ రావ‌డం గ్యారంటీ. అమ‌రావ‌తి విష‌యంలో ఏం చేస్తుందో... విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవ్వారంలో వైసీపీ ఏం చేస్తుందో.. అంతా అబ్జ‌ర్వ్ చేస్తున్నారు. ఇక రైతులు కూడా బానే ప్రిపేర్ అయ్యారు. ఇటు అమ‌రావ‌తి ఉద్య‌మం చేస్తూనే.. అటు స్టీల్ ప్లాంట్ కి మ‌ద్దతిచ్చేందుకు రెడీ అయ్యారు.
ఎవరైనా కొనుక్కోవచ్చు
కొన్ని కొన్ని సార్లు ఎగ‌బ‌డాలి.. ఎదురుగా ఉంది ఎంత పెద్ద ప‌వ‌ర్ ఫుల్ అయినా.. ఎదురు నిల‌బ‌డాలి. లేదంటే క‌ష్ట‌మే. ఇప్పుడు ఏపీలో అదే క‌రువైంది. లేదంటే.. స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ప్ర‌మాదంలో ప‌డేది కాదు. కానీ.. ఇప్పుటికీ లేటేం కాలేదు అంటున్నారు మేథావులు. కాస్త కేర్ ఫుల్ గా డీల్ చేస్తే.. విశాఖ ఉక్కును ప్రైవేట్ ప‌రం కాకుండా కాపాడుకోవ‌చ్చు అని స‌ల‌హా ఇస్తున్నారు.యాక్చువల్ గా ఇలాంటి చాలా పెద్ద పెద్ద ప‌రిశ్ర‌మ‌ల నుంచి.. పెట్టుబ‌డులు ఉప సంహ‌రించుకుంటుంది కేంద్రం. పెట్టుబ‌డుల ప్రోత్సాహ‌క క‌మిటీ ఇచ్చే రిపోర్టుల ప్రకారం మూవ్ అవుతుంది. డెసిష‌న్ మోడీదే అయినా.. సాకు మాత్రం పెట్టుబ‌డుల ప్రోత్సాహ‌క క‌మిటీ. ఆ విష‌యం కూడా అంద‌రికీ తెలిసిందే. అయితే.. మోడీ నిర్ణ‌యం తీసుకుంటే వెన‌క్కి త‌గ్గుతారా చెప్పండి. అయినా మామూలుగానే మోడీ మండి మ‌నిషి.. పీఎంగా ఉన్న‌ప్పుడు ఇంకెంత మొండిగా ఉంటారో తెలిసిందే క‌దా. రైతు ఉద్య‌మం చూస్తే ఆ మాత్రం అర్దం కాదా చెప్పండి.అయితే.. విశాఖ ప్ర‌జ‌లు.. ప్ర‌జా ప్ర‌తినిధులు కానీ.. అడ్డం తిరిగి రాజీనామాలు చేసి ఉద్య‌మాలు చేస్తే.. కేంద్రం వెన‌క్కి తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు మేథావులు. ఎందుకంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ న‌ష్టాల్లో లేదు. అప్పుడ‌ప్పుడూ న‌ష్టాలు వచ్చినా.. ఎక్కువ సార్లు మాత్రం లాభాల్లోనే ఉంటుంది. సో.. ప్ర‌భుత్వం పెట్టుబ‌డులు ఉప‌సంహ‌రించుకోక‌పోయినా న‌ష్టం లేదు. జ‌స్ట్.. సొంత గ‌నులు కేటాయిస్తే చాలు అనేది పెద్ద‌ల లెక్క‌. ఆ విష‌యం కేంద్రానికి కూడా తెలుసు. సో.. ప్ర‌జ‌లు, ప్ర‌జా ప్రతినిధులు కానీ.. ఉద్య‌మం తీవ్ర త‌రం చేస్తే.. సేఫ్ గేమ్ లో భాగంగా.. నిర్ణ‌యం వెన‌క్కి తీసుకుని.. న‌ష్టాలు రాకుండా గ‌నులు కేటాయించే అవ‌కాశం ఉంది అనే మాట వినిపిస్తోంది. కానీ... సీఎం జ‌గ‌న్ కి విశాఖ  ఉక్కు క‌ర్మాగారంపై పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ లేన‌ట్లే క‌నిపిస్తోంది కాబ‌ట్టి.. ఉద్య‌మం తీవ్ర త‌రం అవుతుందా లేదా.. ప్ర‌తి ప‌క్షాల ఉద్య‌మానికి అధికార పార్టీ మ‌ద్ద‌తు స‌రైన స్థాయిలో ఉంటుందా లేదా అన్న‌దే క్వ‌శ్చ‌న్.

Related Posts