YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీలో కొండ్రూకు సెట్ అయిపోయిందా

టీడీపీలో కొండ్రూకు సెట్ అయిపోయిందా

శ్రీకాకుళం, ఫిబ్రవరి  15,
టీడీపీ నుంచి ఈ మధ్యనే విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి పడాలి అరుణ రాజీనామా చేసి బయటకు వచ్చారు. చంద్రబాబు నుంచి గత పదేళ్ళుగా నిరాదరణ ఎదురవుతోంది ఆమె ఆవేదన చెందుతూ పార్టీకి సలాం కొట్టేశారు. మరి ఆ లిస్ట్ లో ఇంకెంతమంది అన్న చర్చ వచ్చినపుడు శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహనరావు కూడా సైకిల్ దిగిపోతారు అని అంతా భావించారు. దానికి తగినట్లుగా ఆయన వైఖరి కూడా నిన్నటి దాకా ఉండేది. విశాఖలో పాలనారాజధానిని ఆయన పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి టీడీపీ పెద్దల కన్నెర్రకు గురి అయ్యారు. ఆ తరువాత పార్టీ మీటింగులకు కూడా పోకుండా ఆయన సైలెంట్ అయ్యారు.అయితే జారిపోతారనుకున్న కోండ్రు మురళీ మోహనరావు ఒక్కసారిగా ఆలోచనలు మార్చుకున్నారని టాక్. దానికి కారణం వైసీపీ నుంచి పిలుపులు లేకపోవడం. మరో వైపు చూస్తే బీజేపీలో చేరాలని వత్తిళ్ళు వచ్చినా కూడా ఆ పార్టీకి పెద్దగా బలం లేదని ఆయన అసలు ఆ వైపుగా చూడలేదని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే టీడీపీలో ఇపుడు సీన్ మారింది. కళా వెంకటరావు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవి నుంచి దిగిపోయారు. ఆయన వర్గం పెత్తనం కూడా రాజాంలో తగ్గింది. అలాగే మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కూడా రాజకీయంగా యాక్టివ్ గా లేరు. తాను తప్ప రాజాంకు వేరే అభ్యర్ధి లేకపోవడంతో కష్టపడితే వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యమేనని కోండ్రు మురళీ మోహనరావు నమ్ముతున్నారుట.ఇక వరసగా రెండు సార్లు వైసీపీ నుంచి రాజాంలో గెలిచిన కంబాల జోగులు జనాల్లో ఉండడంలేదు. ఆయన పట్టు కూడా నిరూపించుకోలేకపోతున్నారు. నిజానికి 2019 ఎన్నికల్లోనే ఆయన ఓడిపోవాలి. కానీ జగన్ వేవ్ లో గెలిచారు. ఇపుడు మాత్రం మూడవసారి గెలిచే ముచ్చట లేదని అంటున్నారు. ఈ పరిణామాలతో మరో మూడేళ్ళ పాటు బలమైన‌ టీడీపీని అలా పట్టుకుంటే తన గెలుపు సాధ్యమేనని కోండ్రు మురళీ మోహనరావు కరెక్ట్ గా లెక్కలు వేసుకుంటున్నారుట. దాంతో ఆయన పంచాయతీ ఎన్నికల వేళ జూలు విదిల్చారు. మొత్తానికి మొత్తం పంచాయతీలు టీడీపీ మద్దతుదారులు గెలిచి తీరాల్సిందే అంటూ రంగంలోకి దిగిపోయారు.రేపటి ఎన్నికల్లో శ్రీకాకుళంలో కచ్చితంగా సగం సీట్లు తెలుగుదేశానికి గ్యారంటీ అని లెక్కలు వేస్తున్నారు. అందులో రాజాం కూడా ఉందిట. అలాగే పాతపట్నం. టెక్కలి. ఇచ్చాపురం వంటివి కూడా టీడీపీ ఖాతాలోనే అంటున్నారు. ఇక కోండ్రు మురళీ మోహనరావుకు అటు అచ్చెన్నాయుడు, ఇటు చంద్రబాబు నుంచి కూడా మద్దతు గట్టిగా ఉండడంతో ఆయన సైకిల్ దిగబోరని అంటున్నారు. మొత్తానికి ఈ పరిణామాలు ఆయన చేతిలో కమలం పువ్వు పెట్టి కాషాయం కప్పాలనుకుంటున్న బీజేపీకి మాత్రం షాక్ గా మారాయని అంటున్నారు

Related Posts