YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

నల్గోండలో మంత్రి హరీశ్ రావు పర్యటన

నల్గోండలో మంత్రి హరీశ్ రావు పర్యటన

నల్లగొండ జిల్లా లో ఎక్కడ చుసిన ధాన్యం రాశులె కనిపిస్తున్నాయి. చాల ఆనందం గా వుంది. సీఎం కేజీఆర్ నాయకత్వంలో ప్రతి నీటి చుక్క ను వినియోగం చేసుకొని రికార్డ్ స్థాయి లో పంటలు పండిచినాం. నిరంతర విద్యుత్ తో వ్యవసాయం లో అద్భుతం అవిష్కృతం అయిందని భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం నాడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అయన పర్యటించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కుడా పాల్గోన్నారు. నకిరేకల్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజక వర్గాల్లో పాల్గోని పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన లు, ప్రారంభోత్సవాలు చేసారు. కార్యక్రమంలో భాగంగా మొదటగా నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇప్పలగుడేo గ్రామంలో 3 కోట్లతో నిర్మిస్తున్న 5 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల గౌడన్స్ కు మంత్రులు భూమి పూజ చేసారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ నల్లగొండ జిల్లా ధాన్యం కొనుగోలులో మొదటి స్థానంలో వుంది. డిండి ప్రాజెక్ట్ లో నీళ్ళు లేకున్నా కల్వకుర్తి నుంచి నింపి నీళ్లు ఇచ్చాం. సాగర్ కింద వారబంది తో రైతులకు అందరికి సాగు నీరు అందింది. తెలంగాణా లో రైతులు సంతోషం గా వున్నారని అన్నారు. సాగు చేసే ప్రతి భూమి కి రైతుకు పెట్టుబడి పథకాన్నీ అమలు చేస్తామన్నారు. మరి కొద్ది రోజుల్లో ఉదయ సముద్రం ప్రాజెక్ట్ కింద సాగు నీరు ఇస్తాం...98 శాతం పనులు పూర్తీ అయ్యాయిన అయన అన్నారు. పండించిన పంటకు ఇబ్బంది కాకూడదని గోదాం లను నిర్మిస్తున్నాము. అన్ని ధాన్యం కొనుగోలు సెంటర్స్ లాల్లో టర్ఫాలైన్ కవర్లు, ఇచ్చాం. రవాణా కూడా తొందరగా చేస్తున్నాం. నకేరేకల్ లో నెల రోజుల్లో నిమ్మ మార్కెట్ ఓపెన్ చేస్తామని మంత్రి వెల్లడించారు. నల్లగొండ లో బత్తాయి మార్కెట్ పనులు పూర్తి అయ్యాయి. దాన్ని కూడా తొందరలో ఓపెన్ చేస్తాం. గత ప్రభుత్వం హయంలో రైతులు నానా అవస్థలు పడ్డారని అయన అన్నారు.

Related Posts