YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీ కాంగ్రెస్ దారెటు..

ఏపీ కాంగ్రెస్ దారెటు..

విజయవాడ, ఫిబ్రవరి 15, 
రాష్ట్ర విభజన చేసిన పాపానికి ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఫలితం అనుభవిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ సోదిలో లేకుండా పోయింది. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో అసలు జాతీయ పార్టీ కాంగ్రెస్ అనేది ఒకటుందా? అన్న సందేహం కలగక మానదు. ఒకవైపు అధికార వైసీపీ, విపక్ష టీడీపీతో పాటు బీజేపీ, జనసేన కూటములు ఎన్నికల వేళ దూకుడుగా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.పదేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో మంచి పట్టుంది. హస్తం గుర్తును ఇప్పటికీ ప్రజలు మరిచిపోరు. సింబల్ మూలంగానే అనేక సార్లు అనేక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే పంచాయతీ ఎన్నికలు కావడం, పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను బరిలోకి దింపే సాహసాన్ని చేయలేకపోయింది. దీనికి అభ్యర్థుల కొరతే కారణమని చెప్పకతప్పదు.పదమూడు జిల్లాల్లో ఎక్కడా కూడా కాంగ్రెస్ ఊసే లేకపోవడం విశేషం. పార్టీ రహితంగా జరిగే ఎన్నికలయినా మద్దతు దారులు కూడా కాంగ్రెస్ కు లభించలేదు. కాంగ్రెస్ నేతలు సయితం పంచాయతీ ఎన్నికలను లైట్ గానే తీసుకున్నారు. ఈ ఎన్నికలను కొంత మేర ఉపయోగించుకుంటే కాంగ్రెస్ ను గ్రామీణ ప్రాంతాల్లో కొంత బలోపేతం చేయగలిగే ఛాన్స్ చిక్కేదంటున్నారు. కానీ ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్ వైపు చూసే వారే కరువయ్యారు. నేతలు సయితం ఎన్నికల వేళ ఇళ్లకే పరిమితమయ్యారు.త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కనీస పోటీ ఇచ్చే అవకాశం లేదు. అయితే ఇక్కడ అభ్యర్థిగా చింతా మోహన్ ను ప్రకటించి బరిలోకి దిగనుంది. చింతా మోహన్ గతంలో రెండు సార్లు ఎంపీగా ఉండటం తమకు కలసి వచ్చే అంశంగా కాంగ్రెస్ భావిస్తుంది. అయినా ఇక్కడ అభ్యర్థి అయితే సులువుగా దొరికాడు కాని ఓట్లు మాత్రం వచ్చే అవకాశం లేదంటున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో ఇక కోలుకునే అవకాశాలు మాత్రం దుర్భిణీ వేసి చూసినా కన్పించడం లేదు.

Related Posts