YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అన్నాడీఎంకేకు రెండాకుల టెన్షన్

అన్నాడీఎంకేకు రెండాకుల టెన్షన్

చెన్నై, ఫిబ్రవరి 15, 
ఎన్నికల వేళ అన్నాడీఎంకేకు మరో ఇబ్బంది ఎదురుకానుంది. అసలే అధికార పార్టీ విజయం అంతంత మాత్రంగానే ఉండటంతో ఇప్పుుడు అన్నాడీఎంకేకు కొత్త సమస్య వచ్చింది. శశికళ పట్టుదలతో ఉన్నారు. జయలలిత పార్టీ తనదేనంటున్నారు. అన్నాడీఎంకేను తిరిగి తన అధీనంలోకి తెచ్చుకునేందుకు ఆమె ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశముంది. అన్నాడీఎంకేకు రెండాకుల గుర్తు కీలకం. ఇప్పుడు ఆ గుర్తు కోసం శశికళ మరోసారి న్యాయపోరాటానికి దిగనున్నారు.జయలలిత మరణానంతరం అన్నాడీఎంకు శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అయితే 2017లో శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లడంతో పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు అన్నాడీఎంకేను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఎన్నికల కమిషన్ ఎదుట దినకరన్ వర్గం, పళనిస్వామి వర్గం గుర్తు కోసం తమ వాదనలను విన్పించాయి. చివరకు పళనిస్వామి వర్గానికే అన్నాడీఎంకేకు చెందిన రెండాకుల గుర్తును కేంద్ర ఎన్నికల కమిషన్ కేటాయించింది.మరికొద్ది నెలల్లోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నిలకు జరుగతున్నాయి. శశికళ తన నాలుగేళ్ల శిక్ష పూర్తి చేసుకుని బయటకు వచ్చారు. ఇప్పుడు ఆమె దృష్టంతా అన్నాడీఎంకే పైనే ఉంది. ముందుగా రెండాకుల గుర్తు కోసం న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటీషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా తనను అక్రమంగా తొలగించారని శశికళ వాదనలను విన్పించనుంది.ఎన్నికల వేళ గుర్తు కోసం మరోసారి న్యాయపోరాటం అధికార అన్నాడీఎంకేకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే ఎన్నికలకు అన్నాడీఎంకే సమాయత్తమయింది. ఈ పరిస్థితుల్లో గుర్తు కోసం పోటీ పడటం పార్టీకి సమస్యలు తలెత్తే అవకాశముందని భావిస్తున్నారు. దీనిపై పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు న్యాయనిపుణులతో సమీక్ష చేసినట్లు తెలిసింది. గుర్తు కేటాయింపులో ఏమాత్రం తేడా వచ్చినా ఇక పళనిస్వామి, పన్నీర్ సెల్వం చరిత్ర రాజకీయంగా ముగిసినట్లే. మొత్తం మీద శశికళ రాకతో ఊహించని తలనొప్పులు అన్నాడీఎంకే ఇబ్బందికరంగా మారాయి.

Related Posts