YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మళ్లీ వసుంధరేనా

మళ్లీ వసుంధరేనా

జైపూర్, ఫిబ్రవరి 15, 
రాజకీయాల్లో ఎత్తుపల్లాలు మామూలే. అయితే సరైన సమయంలో సరైన రూట్ ను ఎంచుకున్నవారే రాజకీయాల్లో రాణిస్తారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఇదే కోవలోకి వస్తారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వసుంధర రాజే యాక్టివ్ అయ్యారు. మరోసారి తనదే ముఖ్యమంత్ర పీఠం అన్న సంకేతాలను పార్టీ నేతలకు, అధినాయకత్వానికి పంపే ప్రయత్నాలను రాజే చేస్తున్నట్లే కన్పిస్తుంది. మూడేళ్ల నుంచి వసుంధర రాజే యాక్టివ్ గా లేరు. ఒకరకంగా చెప్పాలంటే విపక్షంలో ఉన్నప్పటికీ ఆమె ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కు అనుకూలంగానే పరోక్షంగా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రాకుండా చూడటంలో వసుంధర రాజే ప్రముఖ పాత్ర పోషించారంటారు. తనకు సన్నిహితమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆమె మాట్లాడి పార్టీని వీడకుండా చూసే ప్రయత్నాలు చేశారన్న ప్రచారం కూడా జరిగింది.
సచిన్ పైలెట్ ను రాజకీయంగా ఎదగనివ్వకుండా చేసేందుకే వసుంధ రాజే అశోక్ గెహ్లాత్ కు అనుకూలంగా వ్యవహరించారంటారు. మరోవైపు పార్టీలో కూడా తనను పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతుంది. గత ఎన్నికల సమయంలోనే ఆమె సూచించిన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు టిక్కెట్లను కేటాయించడం ఇందుకు ఉదాహరణ. ఓటమి పాలయిన నాటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆమె అతి తక్కువగానే పాల్గొంటున్నారు.
గత కొన్ని రోజులుగా వసుంధర రాజే బీజేపీ కీలక నేతలను కలుసుకుంటుండటం చర్చనీయాంశమైంది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, రాజస్థాన్ ఇన్ ఛార్జ్ అరుణ్ సింగ్ లతో సమావేశమయ్యారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సయితం వసుంధర రాజేతో గంటల సమయం సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో వసుంధర రాజే మరోసారి తన గ్రిప్ ను వదులుకునేందుకు ఇష్టపడటం లేదని ఆమె వరస సమావేశాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే బీజేపీలో ఒక వర్గం మాత్రం వసుంధర రాజే పెత్తనాన్ని వ్యతిరేకిస్తుంది. మరి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Related Posts