YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖకు 1400 కోట్లు....

విశాఖకు 1400 కోట్లు....

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15, 
జగన్ ని కుడి చేత్తో పోటు పొడిచి ఎడం చేత్తో కాస్తా తైలం పూస్తోంది బీజేపీ. ఏపీకి బడ్జెట్ లో నిధులు ఇవ్వకపోయినా జగన్ మనసెరిగిన కేంద్ర పెద్దలు 15వ ఆర్ధిక సంఘం ద్వారా అతి పెద్ద ఊరటను ఇచ్చే ప్రయత్నం చేశారు. దాని కధా కమామీషూ ఏంటి అంటే విశాఖను ఆర్ధిక రాజధానిగా గుర్తించడం. రానున్న అయిదేళ్ల కాలానికి 1400 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని విశాఖ ప్రగతి కోసం మంజూరు చేయడం. దాని వల్ల విశాఖ ఆర్ధికంగా నిలదొక్కుకోవడమే కాదు పెట్టుబడులను ఆకట్టుకునే సిటీగా మారుతుంది. ఏపీకి ఏదో నాడు ఆర్ధిక వనరుగా నిలబడుతుంది.జగన్ విశాఖను పాలనా రాజధాని అంటున్నారు. దానికి కేంద్ర పెద్దలు ఔను అని కానీ కాదని కానీ ఇప్పటికీ చెప్పడంలేదు. అదే సమయంలో ఏపీ బీజేపీ నేతలు అమరావతి ఏకైక రాజధాని అంటున్నారు. ఈ అయోమయం ఇలా ఉండగానే ఏపీలో అతి పెద్ద నగరంగా ఉన్న విశాఖలో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం 15వ ఆర్ధిక సంఘం నిధులను ఇవ్వాలనుకోవడం శుభ పరిణామంగానే చూస్తున్నారు. సాధారణంగా రాజధాని ఎక్కడ ఉంటే అక్కడ మరింత అభివృద్ధికి ఈ తరహా నిధులను ఇస్తారు. కానీ ఏపీకి రాజధానిగా పేరుకు అమరావతి ఉంది. విశాఖ వైపు జగన్ చూపు ఉంది. దాంతో జగన్ కోరుకున్నట్లుగా విశాఖకే ఈ భారీ నిధుల మంజూరు చేశారని అంటున్నారు. ఈనేపథ్యం నుంచి చూసినపుడు నాటి చంద్రబాబు సర్కార్ కలల రాజధాని అమరావతి మరింతగా కళ తప్పినట్లే అంటున్నారు. అమరావతిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 14వ ఆర్ధిక సంఘం నుంచి భారీ ఎత్తున నిధులను కోరారు. కానీ నాడు ఎందుకో రిక్త హస్తమే చూపించారు. ఇపుడు జగన్ సర్కార్ ఏలుబడిలో మాత్రం విశాఖను ఆర్ధిక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర పెద్దలు నిధులు మంజూరు చేయడం అంటే ఇండైరెక్ట్ గా అమరావతి రాజధానిని ఏమీ కాకుండా చేయడమేనని అంటున్నారు. మొత్తానికి జగన్ ప్రభుత్వం గత ఇరవై నెలలలో కొత్తగా అమరావతిని అభివృద్ధిని చేసింది లేదు. ఇపుడు కేంద్ర నిధులు కూడా విశాఖ దారి పడుతున్నాయంటే రానున్న రోజుల్లో రాజధాని హోదా ఉంటుందా అన్న చర్చ అయితే గట్టిగా ఉంది.మరో వైపు చూస్తే విశాఖ వంటి రెడీ మేడ్ సిటీకి మరిన్ని నిధులు కేటాయిస్తే కచ్చితంగా పెట్టుబడులను తెస్తుందని మేధావులు, ఆర్ధిక నిపుణులు అంటున్నారు. విశాఖ సీ పోర్టు తో పాటు అన్ని వైపుల నుంచి కనెక్టివిటీ ఉన్న నగరం కావడంతో దేశానికి ముంబై మాదిరిగా ఏపీకి ఆర్ధిక రాజధాని అనడంతో సందేహమే లేదని కూడా చెబుతున్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో విశాఖను డెవలప్మెంట్ చేయడం ఉత్తమమైన ఆలోచనే కాగలదు అని కూడా అంటున్నారు. మొత్తానికి జగన్ కోరుకున్న విశాఖకు భారీ నిధులు దక్కాయి. ఇదే ఊపులో పాలనారాజధానిగా కూడా విశాఖ తొందరలోనే గుర్తింపు పొందుతుందా అన్న చర్చ అయితే ఉంది.

Related Posts