బీఈడీ కౌన్సిలింగ్ ను వెంటనే నిర్వహించాలి ..
ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగ మధు యాదవ్
ఎమ్మిగనూరు ఫిబ్రవరి 15,
రాష్ట్ర వ్యాప్తంగా బీఎడ్ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ ను నిర్వహించడంలో గత ముడు నెలలుగా జాప్యం జరుగుతుందని, వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఉన్నత విద్యాశాఖను ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగ మధు యాదవ్ డిమాండ్ చేశారు సోమవారం స్థానిక పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ బీఎడ్ ప్రవేశాలకు అక్టోబర్ లో ప్రవేశ పరీక్ష నిర్వహించి అదే నెలలో ఫలితాలు విడుదల చేసినప్పటికీ , మూడు నెలలకు పైగా కావస్తున్నా కౌన్సిలింగ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నిర్ణయం ఖరారు కాకపోవడంపై నిర్వహించకపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన లో ఉన్నారని , కావున ఉన్నత విద్యామండలి స్పందించి వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించాలని ఈయన డిమాండ్ చేశారు. వేల సంఖ్యలో రాష్ట్రము లోని విద్యార్థులు కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. సమావేశంలో వసతిగృహాల రాష్ట్ర కన్వీనర్ వీరేష్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి రాజు,జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, మనుసుర్, రవి ,అజయ్ పాల్గొన్నారు