YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కాంగ్రెస్  నేత షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలు  

కాంగ్రెస్  నేత షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలు  

కాంగ్రెస్  నేత షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలు  
కామారెడ్డి  ఫిబ్రవరి 15
సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ అని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. సోమవారం రోజు మాజీ మంత్రి షబ్బీర్ అలీ 64వ పుట్టినరోజు సందర్భంగా, మండలంలో పెద్ద ఎత్తున పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో కేక్ కట్ చేసి, భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ, పేదలకు నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ, పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ షబ్బీర్ అలీ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ప్రజల మద్దతుతో మళ్లీ ఉన్నత పదవులు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మద్ది చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీటీసీ మోహన్ రెడ్డి, నాయకులు భీమ్ రెడ్డి, పునురి దయాకర్ రెడ్డి, దుంపల మోహన్ రెడ్డి, చేపూరి రాజు, అందే దయాకర్రెడ్డి, తాటిపాముల లింబాద్రి, బల్యాల సుదర్శన్, లింగారెడ్డి, మహిపాల్, సిద్ధిరాములు, ఎల్లారెడ్డి, తిరుమల స్వామి, గోపాల్ రెడ్డి, యాద గౌడ్, మంద నరసింహులు, సిద్దా గౌడ్, వెంకటేష్ గౌడ్, సాజిద్, మద్దూరి రవి, సూర్య కాంత్ రెడ్డి, కమ్మరి అశోక్, పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts