YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఘనంగా భక్తరామదాసు 388 వ జయంతి ఉత్సవాలు ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి  

ఘనంగా భక్తరామదాసు 388 వ జయంతి ఉత్సవాలు ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి  

ఘనంగా భక్తరామదాసు 388 వ జయంతి ఉత్సవాలు
ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి  
ఖమ్మం ఫిబ్రవరి15 
శ్రీరాముని అపర భక్త గ్రేసరుడు భక్త రామదాసు 388వ జయంతి ఉత్సవాలు తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, జిల్లా కలెక్టర్‌, పాలనా యంత్రాంగం, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం, స్థానిక భక్తరామదాసు కళాపీఠం ఆధ్వర్యంలో నేలకొండపల్లి లో  స్థానిక రామదాసు ధ్యాన మందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ధ్యాన మందిరంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం వేద పండితులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్త రామదాసు విగ్రహంపై నిర్మించిన మండవ గోపురంపై కలశం ప్రతిష్ట, సంప్రోక్షణ, తీర్థ ప్రసాదాలు, మాలాధారణ వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం 10 గంటలకు సంగీత అభిమానులు, పురప్రముఖులు, భక్తులచే నగర సంకీర్తన అనంతరం సభ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి ధ్యాన మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముని అపర భక్తాగ్రేసరుడైన భక్తరామదాసు చరిత్రను రానున్న తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ విస్తతంగా ప్రచారం చేయాలన్నారు. ధ్యాన మందిరంలో జరుగుతున్న ఆలయ ఆధునీకరణ పనులు సైతం నత్తనడకన సాగుతుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, నేలకొండపల్లి మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ రాయపూడి నవీన్‌, ఎంపీటీసీ బొడ్డు బొందయ్య, శీలం వెంకటలక్ష్మి, దోసపాటి కల్పన, స్థానిక శ్రీ భక్త రామదాసు విద్వత్‌ కళాపీఠం అధ్యక్షులు సాదు రాధాకృష్ణమూర్తి, మందిరం పూజారి రమేష్‌, సంగీత అభిమానులు, భక్తులు పాల్గొన్నారు

Related Posts