వైభవంగా సుజయీంద్రతీర్థుల ఆరాధన
మంత్రాలయం ఫిబ్రవరి15
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి పూర్వపు పీఠాధిపతులు శ్రీ సుజయీంద్రతీర్థుల ఆరాధన వేడుకలు శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థులు అధ్వర్యంలో సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుజయీంద్రతీర్థుల బృందావనానికి విశేష పంచామృతాభిషేక పూజ , ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుజయీంద్రతీర్థుల చిత్రపటాన్ని స్వర్ణ రథం పై ఉంచి ప్రత్యేక పూజలు చేసి భక్తుల హర్షధ్వానాలు మధ్య మఠం ప్రాకారం చుట్టూ ఊరేగించారు. ఉంజాల సేవా మండపంలో పీఠాధిపతులు సుభుదేంద్రతీర్థులు సుజయీంద్రతీర్థుల ప్రవచనములకు భక్తులకు చదివి వినిపించారు. అంతకు ముందు రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆరాధనను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.భక్తులు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని, రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పండిత కేసరి రాజ యస్ గిరియచార్ , మఠం ఏఏఓ మాధవ శెట్టి, మఠం మేనేజర్ వెంకటేష్ జోషీ, సీఆర్వో ఐపి నరసింహ స్వామి, హోనలి వ్యాసరాజ్, తదితరులు పాల్గొన్నారు.
రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న సంగీత దర్శకుడు కీరవాణి:- మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి ని దర్శించుకునేందుకు సినీ సంగీత దర్శకుడు యం యం కీరవాణి సోమవారం వచ్చారు. వీరు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని , రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. వీ రి మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థులు శేష వస్ర్తం కప్పి ఫల మంత్రక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.