ఈ నెల 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. వైజాగ్ వేదికగా ఫలితాలు ఎప్రిల్ 29 న ఉ. 11 గం.లకు విడుదల చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.మరింత మంది డిఎస్సీకి అర్హత సాధించేదిశగా మరో టెట్ ను నిర్వహించాలని ఈ క్రమంలో మే 4 న నోటిఫికేషన్ విడుదల చేయాలని, జూన్ 10 నుంచి టెట్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపసారు. గతంలో లాగానే ఆన్ లైన్ లో టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ లెర్నింగ్, వయోజన విద్య, మౌలిక వసతులున, లైబ్రరీలు, ఉపాధ్యాయ శిక్షణ వంటి అంశాల్లో రోటరీ క్లబ్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. ఆగష్టు లోగా డిఎస్సీ నిర్వహించాలని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు మంత్రి గంటా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో రెండు రోజుల్లోగా ఖాళీలపై స్పష్టత ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. డిఎస్సీపై ఈ మేరకు ప్రకటన త్వరలో విడుదల చేస్తామని మంత్రి గంటా తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం చేసే దిశగా పాఠశాలల్లో కల్పించనున్న మౌలిక వసతుల కల్పనపైనాఅధికారులతో చర్చించినట్లు తెలిపారు. యాన్యుటీ ప్రాతిపదికన పాఠశాలల్లో కల్పిస్తున్న మౌలిక వసతులను ఎలా కల్పించాలి? తొలుత ప్రాధాన్యం దేనికి ఇవ్వాలన్న అంశాలపై చర్చించారు. కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలు, డిగ్రీ కళాశాలలకు సంబంధించి జీవోలు జారీ చేసి.. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి గంటా స్పష్టం చేశారు. మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని వేసవి తీవ్ర ఉష్ణోగ్రతల రీత్యా వాయిదా వేయడం జరిగిందని, జూన్ తొలి వారంలో నిర్వహించాలని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్నెంచినట్లు తెలిపారు. మే 1 నుంచి జరగాల్సిన జ్ఞానదార కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.. రాష్ట్రాన్ని నాలెడ్జ్ స్టేట్ - ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దడమే ధ్యేయంగా వినూత్న సంస్కరణలుచ ఆచరణాత్మక పద్ధతులతో ముందుకెళ్లాలని మంత్రి గంటా ఉన్నతాధికారులకు పిలుపునిచ్చారు.