YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

ఏసీబీ వలలో కర్నూలు మునిసిపల్ ఉద్యోగి

ఏసీబీ వలలో కర్నూలు మునిసిపల్ ఉద్యోగి

కర్నూలు మునిసిపాలిటీలో బిల్లు కలెక్టర్ గా పనిచేస్తున్న సుధాకర్ మంగళవారం నాడు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయాడు. కర్నూలు అయ్యప్ప నగర్ లోని శ్రీ సాయి విద్యానికేతన్ స్కూలుకు కొత్త నీటి కనెక్షన్ ఇవ్వడానికి సుధాకర్ ఐదు వేల రూపాయలు లంచం డిమాండ్ చేసారు. దాంతో స్కూలు యాజమాన్యం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఏసీబీ రంగంలోకి దిగింది. వారు చెప్పినట్లు స్కూలు యాజమాన్యం తన ప్రతినిధిగా రవికుమార్ ను లంచం డబ్బులతో సుధాకర్ దగ్గరకు పంపించింది. మంగళవారం మద్యాహ్నం శ్రీరామ్ టాకీస్ దగ్గర సుధాకర్ లంచం తీసుకుంటునప్పుడు అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.

Related Posts