ఎండ్లబండ్ల ర్యాలీ
ఒంగోలు ఫిబ్రవరి 16,
ఎడ్లబండ్ల కు ఇసుక రవాణాకు మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వేటపాలెం మండలంలో అమలు చేయాలని, ఇసుక అక్రమ రవాణా ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఓరుగంటి రెడ్డి యువజన సంఘం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల యజమానులు వేటపాలెం నుండి చీరాల వరకుఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు.ప్రకాశం జిల్లా చీరాల లో శాసనసభ్యుడు కరణం బలరాం కృష్ణ మూర్తి ని కలిసి ఎడ్లబండ్ల యజమానుల సమస్యల పై అందజేశారు.
వేటపాలెం మండలంలో ప్రభుత్వ భూముల నుండి స్మశానం లో నుండి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే కొంతమంది ప్రభుత్వ అధికారులు ఇసుక మాఫియా తో కుమ్మక్కయి ఇసుక అక్రమ రవాణా సహకరిస్తున్నారని వేటపాలెం ఎడ్లబండ్ల యజమానులు ఆరోపించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇసుక రవాణా లో ఎడ్లబండ్ల కు మినహాయింపు ప్రకటన చేసినప్పటికీ, ప్రభుత్వ అధికారులు ఎడ్లబండ్లపై ఇసుక రవాణాను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎడ్లబండ్ల కు ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వటం ద్వారా సామాన్యులకు ఇసుకను అందుబాటులోకి ప్రభుత్వం తీసుకు రాగలవు తుందని తద్వారా చీరాల నియోజకవర్గంలో సుమారు 30 వేల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు గమనించాలని ఓరుగంటి రెడ్డి యువజ సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ విషయమై చీరాల శాసనసభ్యుడు కరణం బలరాం కృష్ణ మూర్తి ని కలిసి వినతిపత్రం అందజేశారు. కరణం బలరాం కృష్ణ మూర్తి ఎడ్లబండ్ల యజమానులతో మాట్లాడుతూ ఎడ్లబండ్ల పై ఇసుక రవాణాకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మినహాయింపు ఇస్తూ గతంలోనే ప్రకటన చేశారని,జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి ఎడ్లబండ్ల సమస్యలు తీసుకువెళ్లి వీలైనంత త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శాసనసభ్యులు బలరాం వెంట వైయస్సార్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంటి వైద్యులు వరికూటి అమృతపాణి ఉన్నారు.ఎమ్మెల్యేని కలిసినవారిలో ఓరుగంటి రెడ్డి యువజన సంఘం నాయకులు దొడ్ల రాజేష్ రెడ్డి, నాయుడు చిన్న మస్తాన్ రెడ్డి, భోగి రెడ్డి నాగరాజు రెడ్డి, బక్క నరేష్ రెడ్డి, బోయిన శ్రీనివాసరెడ్డి , దుండి ఈశ్వర్ రెడ్డి, ఎడ్ల బండ్లు యజమానులు అక్కల కృష్ణారెడ్డి, బట్టు మస్తాన్, జోగులు, కావూరి వెంకటేశ్వర్లు, ఆసాది మస్తాన్ రెడ్డి వినోద్ తదితరులు పాల్గొన్నారు.