YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

యువ శాస్త్రవేత్త హరినాథ్ రెడ్డి ని సత్కారం చేసిన  హిమాచల్ ప్రదేశ్ గవర్నర్

యువ శాస్త్రవేత్త హరినాథ్ రెడ్డి ని సత్కారం చేసిన  హిమాచల్ ప్రదేశ్ గవర్నర్

యువ శాస్త్రవేత్త హరినాథ్ రెడ్డి ని సత్కారం చేసిన  హిమాచల్ ప్రదేశ్ గవర్నర్
ములుగు ఫిబ్రవరి 16, 
మారుమూల పల్లెలో చదివి ఐరాస వరకు వెళ్లిన యువ శాస్త్రవేత్త డాక్టర్ ఐరెడ్డి హరినాథ్‌ రెడ్డిని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సన్మానించి సత్కరించారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన పేద రైతు కుంటుంబానికి చెందిన ఐరెడ్డి హరినాథ్ రెడ్డి ఉన్నత విద్యనభ్యసించి దేశ సేవల కోసం పలు ఆవిష్కరణలు చేపడుతున్నారనే వార్తాకథనాలకు బండారు దత్తాత్రేయ మంత్రముగ్దుడయ్యారు. మన తెలుగు బిడ్డ మరింత ఉన్నత శిఖరాలకు ఎదగడంతోపాటు దేశాభివృద్దికి మరెన్నో సేవలందించడానికి ప్రోత్సహించాలనే సంకల్పంతో బెంగుళూరులో విధి నిర్వహణలో ఉన్న డాక్టర్ హరినాథ్‌ రెడ్డికి ఫోన్ చేసి హైదరాబాద్‌ రప్పించుకుని తన నివాసంలో గవర్నర్ దత్తాత్రేయ సత్కరించి ఆశీస్సులందించారు. డాక్టర్ హరినాథ్ రెడ్డి కరోనా వైరస్‌ను నాశనం చేసే పరికరాన్ని ఆవిష్కరించారు. పరికరాలు మెటీరియల్స్‌, నానో పార్టికల్స్‌ తదితర వస్తువులను ఎలాంటి ఉష్ణోగ్రతలో అయినా పరీక్షించే కాంటీవివర్‌బీమ్‌ మాగ్నటోమీటర్‌ను రూపొందించారు. దీనిపై సమర్పించిన ప్రఖ్యాత అమెరికన్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.అదే విధంగా కమ్యూనికేషన్ వ్యవస్థలో అద్భుతంగా పనిచేసే స్పిన్‌ డయోడ్‌ను రూపొందించారు. ఇది సంప్రదాయ డయోడ్ ల కన్నా ఎన్నో రెట్లు మెరుగైన పనితీరును చూపుతుంది.

Related Posts